MLA Madhavi Reddy: ఏం అనుకుంటున్నావు.. దమ్ముంటే మీ నేత జగన్ సమావేశానికి రాలేదు.. ఎందుకో ప్రశ్నించు.. అలాగే మీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రాలేదు.. అది అడుగు అంతేకానీ మీ ఇష్టం వచ్చినట్లు ప్రశ్నిస్తానంటే కుదరదంటూ కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఫైర్ అయ్యారు.
కడప జిల్లా మాజీ సీఎం జగన్ స్వంత జిల్లా. జిల్లా కేంద్రమైన కడపలో గట్టి పోటీనిచ్చి, టీడీపీ తరపున ఎమ్మెల్యేగా మాధవీ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. ఈమె విజయం వైసీపీకి పెద్ద షాక్ అనే చెబుతుంటారు కడప జిల్లా వాసులు. అలా ఎమ్మెల్యేగా గెలిచారో లేదో మాధవీ రెడ్డికి స్థానిక మేయర్ సురేష్ బాబుకు చెత్త వ్యవహారంలో వివాదం రాజుకుంది. ఈ వివాదం చివరికి చిలికి చిలికి గాలివానగా మారి, మేయర్ ఇంటి ముందు చెత్త వేసే వరకు దారి తీసింది. ఇలా సమయం దొరికినప్పుడల్లా వైసీపీపై విరుచుకుపడడంలో ఏమాత్రం వెనక్కు తగ్గేదేలేదంటారు ఈ మహిళా ఎమ్మెల్యే.
తాజాగా మరోమారు మాధవీ రెడ్డి ఫైర్ అయ్యారు. అది కూడా ఏకంగా డీఆర్సీ సమావేశంలో అందరు అధికారుల సమక్షంలో. ఇంతకు ఏమి జరిగిందంటే.. కడపలో జరుగుతున్న డిఆర్సీ సమావేశానికి ఎమ్మేల్యే మాధవీ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అభివృద్దికి సంబంధించిన అంశాలపై సుధీర్ఘ చర్చ సాగింది. ఇక సమావేశం ముగిసిందనుకుంటున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. వాటికి సమాధానం ఇచ్చిన అనంతరం మాధవీ రెడ్డి ఒక్కసారిగా మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప డీఆర్సీ సమావేశానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు రాలేదు? ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీకి రారు, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి రారు. ఇంకెందుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది. అసలు భాద్యత ఉందా.. అభివృద్దికి సంబంధించిన అంశాలపై సుధీర్ఘ చర్చ జరుగుతుంటే, ఇవి కూడా పట్టవా అంటూ మాధవీ రెడ్డి ఫైర్ అయ్యారు.
అలాగే జగన్, అవినాష్ రెడ్డి లకు సమావేశానికి వచ్చేందుకు భయమని, దమ్ముంటే ఇవి రాసుకో అంటూ వేలెత్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన పులివెందుల ఎమ్మేల్యే, కడప ఎంపీ ఎందుకు రాలేదో, అది కూడా తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇక అంతే సమావేశ మందిరం అంతా సైలెంట్ గా మారింది. ఎంతైనా కడప ఎమ్మేల్యేనా మజాకా అంటూ స్థానిక టీడీపీ నాయకులు అక్కడ చర్చించుకున్నారు. అలాగే ఎమ్మేల్యే ఫైర్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కడప డీఆర్సీ సమావేశానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు రాలేదు? ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీకి రాడు, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి రాడు.
తల తిక్క ప్రశ్నలు అడుగుతున్న "దొంగ సాక్షి" విలేకరిని ప్రశ్నించిన కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి… pic.twitter.com/LivtFnmrV8— Telugu Desam Party (@JaiTDP) November 6, 2024