E-Paper
Advertisement

Ranbir Kapoor : కొత్త బిజినెస్ మొదలెట్టిన రణబీర్ కపూర్… బర్త్ డే స్పెషల్ గా బట్టల వ్యాపారం

Ranbir Kapoor : కొత్త బిజినెస్ మొదలెట్టిన రణబీర్ కపూర్… బర్త్ డే స్పెషల్ గా బట్టల వ్యాపారం
Advertisement

Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన పుట్టినరోజూ సందర్భంగా కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేశారు. శనివారం తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్న రణబీర్ కపూర్ తన సొంత లైఫ్ స్టైల్ బ్రాండ్ ఆర్క్స్‌ను ప్రారంభించి బర్త్ డే సెలబ్రేషన్స్ ను మొదలు పెట్టారు.

రణబీర్ కొత్త బిజినెస్ 

Advertisement

రీసెంట్ గా యానిమల్ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఈ బాలీవుడ్ బర్త్ డే బాయ్ ఆర్క్స్ అనే లైఫ్ స్టైల్ బ్రాండ్ ని లాంచ్ చేయగా, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, రణబీర్ కపూర్ తల్లి నీతు కపూర్ సోషల్ మీడియా వేదికగా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు, ఆర్క్స్ బ్రాండ్ గురించి ప్రస్తావించారు. ముందుగా రణబీర్ తల్లి నీతు కపూర్ తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆర్క్స్ బ్రాండ్ గురించి పోస్ట్ చేసింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు.. నా సంతోషం, నా గర్వం, నా స్వచ్ఛమైన ఆత్మ.. నువ్వు కోరుకున్నది జరగాలని ఆశిస్తున్నాను” అంటూ తన పోస్టులో ఆర్క్స్ ను కూడా ట్యాగ్ చేసింది.

“మీరు రణబీర్ కపూర్ స్టార్ మ్యాజిక్, ఎక్సలెన్స్ ని చూశారు. ఇప్పుడు ఆయన లైఫ్ స్టైల్ బ్రాండ్ ఆర్క్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టండి” అంటూ కరణ్ జోహార్ ఆర్క్స్ ను ట్యాగ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆర్క్స్ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఇది అఫీషియల్ ఆర్క్స్ ఇంస్టాగ్రామ్ హ్యాండిలా కాదా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు. కానీ అందులో పోస్ట్ చేసిన టీజర్ లో రణబీర్ కపూర్ రాత్రి పూట పడుకుని ఆకాశంలోకి చూస్తూ కనిపించాడు. అలాగే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కలుపుతూ ఆర్క్స్ లోగోను గీయడం కనిపిస్తోంది. అయితే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఆయన తల్లి నీతూ ‘గుడ్ లక్’ అని కామెంట్ చేయగా, అలియా భట్ లైక్ చేయడం విశేషం. ఈ సందర్భంగా రణబీర్ కు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ బిజినెస్ ను స్టార్ట్ చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన బిజినెస్ బాగా జరగాలని కోరుకుంటున్నారు. కానీ దీన్ని అఫిషియల్ గా ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి.

Advertisement

ఆర్క్స్ అనే పేరుకు అర్థం ఇదేనా?

ఇదిలా ఉండగా రణబీర్ కపూర్ ఇప్పుడు తన లైఫ్ స్టైల్ బ్రాండ్ పేరు ఆర్క్స్ అని పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దానికి అర్థం ఏంటి అని ఆరా తీయగా,  అలియా, రణబీర్, తన కుమార్తె రాహ పేర్లు కలిసి వచ్చేలా ఈ పేరును పెట్టారని అంటున్నారు. ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ అనే సినిమాను చేయబోతున్నారు. ఇందులో అలియా భట్, విక్కీ కౌశల్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్రహ్మస్త్ర పార్ట్ 2’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ తర్వాత యానిమల్ టు, రామాయణం సినిమాలు కూడా రాబోతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×