Ranbir Kapoor: ఒకప్పుడు హీరోయిన్స్‌కు పెళ్లయ్యి, పిల్లలు పుట్టేస్తే ఇక వారి కెరీర్ క్లోజ్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్లయ్యి, పిల్లలు పుట్టి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసినా కూడా సినిమాలను పక్కన పెట్టడం లేదు నటీమణులు. అలాగే వారికి అవకాశం ఇవ్వడానికి కూడా మేకర్స్ వెనకాడడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ పద్ధతి ఎప్పటినుండో నడుస్తోంది. బీ టౌన్‌లో హీరోయిన్స్‌కు పెళ్లయితే వారికి అవకాశాలు ఇవ్వకూడదు అనే సెంటిమెంట్ ఉండదు. అందుకే ఇప్పటికీ చాలామంది సీనియర్ హీరోయిన్స్ లీడ్ రోల్స్ ప్లే చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. అందుకే ఆలియా భట్ కూడా రెండో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న విషయం బయటపడింది.
రెండో బిడ్డ
గత కొన్నేళ్లలో చాలామంది బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. అందులో రణబీర్ కపూర్, ఆలియా భట్ కూడా ఒకరు. ఆలియా కంటే ముందు పలువురు స్టార్ హీరోయిన్స్‌తో ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. ఆ తర్వాత ఆలియా భట్‌తో పెళ్లి అనగానే చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. పెళ్లి అయిన వెంటనే ఆలియా ప్రెగ్నెంట్ అన్నప్పుడు మరింత షాకయ్యారు. పెళ్లయినా, పాప పుట్టినా కూడా కెరీర్‌కు ఎక్కడా లాంగ్ బ్రేక్ ఇవ్వలేదు ఆలియా భట్. అందుకేనేమో అప్పుడే సెకండ్ బేబీ గురించి ప్రస్తావన మొదలుపెట్టాడు రణబీర్ కపూర్. తాజాగా రెండో బిడ్డను కనడం గురించి తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా బయటపెట్టాడు ఈ బీ టౌన్ హ్యాండ్‌సమ్ హీరో.
పేరు కూడా ఫిక్స్
ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్‌కు రాహా కపూర్ అనే పాప ఉంది. అయితే రెండో బిడ్డ బాబు అయితే బాగుంటుందని, అప్పుడే బాబుకు పేర్లు కూడా అనుకుంటున్నామని బయటపెట్టాడు రణబీర్ కపూర్. త్వరలోనే ఫ్యామిలీని మరింత పెంచాలని అనుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. దీంతో ఆలియా భట్ మళ్లీ ప్రెగ్నెంటా అని అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇప్పటికే రాహా కపూర్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కపూర్ కపుల్ రాహాను తీసుకొని పబ్లిక్‌లోకి వచ్చిన ప్రతీసారి ఫోటోగ్రాఫర్లు తనను ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఇదే సమయంలో కొడుకు గురించి రణబీర్ చేసిన వ్యాఖ్యలు చేస్తుంటే వీరి కొడుకు కూడా అంతే క్యూట్‌గా ఉంటాడని అనుకుంటున్నారు.
Also Read: ‘గ్రోక్’ మావా తగ్గాడురో.. ‘సిగ్గుపడుతున్నా’.. ‘సారీ’ అంటూ పోస్ట్
ఇద్దరూ బిజీ
ప్రస్తుతం రణబీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) ఎవరి కెరీర్‌లో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’తో ఒక్కసారిగా రణబీర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు నితేష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ్’తో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ కూడా లైన్‌లో ఉంది. ఇక ఆలియా భట్ కూడా ఒకవైపు సినిమాలతో పాటు బిజినెస్‌లతో కూడా బిజీ అయిపోయింది. పెళ్లయిన తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరినీ మెప్పిస్తోంది ఆలియా. ఇక పెళ్లి తర్వాత రెండోసారి తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి ‘లవ్ అండ్ వార్’లో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.