BigTV English

Randeep Hooda : ఎట్టకేలకు పెళ్ళికొడుకైన కిక్ మూవీ యాక్టర్..

Randeep Hooda : ఎట్టకేలకు పెళ్ళికొడుకైన కిక్ మూవీ యాక్టర్..
Randeep Hooda

Randeep Hooda : సల్మాన్ ఖాన్ .. కిక్ మూవీలో నటించిన రణదీప్ హుడా.. తన ప్రేయసి లిన్ లైష్రామ్‌ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ అతని పెళ్లి జరిగింది ఎక్కడో తెలుసా.. మణిపూర్ లోని ఇంపాలాలో అతని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. మణిపురి సంప్రదాయాన్ని అనుసరించి ఈ పెళ్లి వేడుకలు జరగడంతో వెడ్డింగ్ లుక్స్ లో ఉన్న పెళ్లి జంట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.


వివాహం జరిగిన తీరు కూడా ఎంతో కొత్తగా ఉంది.. మణిపురి వివాహ పద్ధతులు వేరే రాష్ట్రాల వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు.. అందుకే ఈ ఫోటోలు ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తున్నాయి. రణదీప్ తెల్లటి కొత్త దోవతి.. తలకు తెలుపు కి పసుపు బోర్డర్ ఉన్న తలపాగాతో రాయల్ గా ఉన్నాడు. మరోపక్క వధువు మణిపురి సంప్రదాయ దుస్తులతో ఎంతో అందంగా ఉంది. ఆమె పెళ్లికి ధరించిన బంగారు నగలు ఒళ్లంతా దగదగా మెరిసిపోతున్నాయి.

పెళ్లి తంతు మొదలైన దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగానే ఉంది అంటున్నారు నెటిజన్స్. పెళ్లి కూతుర్ని మండపం దగ్గరకు తీసుకురావడం.. ఆమె నడుస్తూ వచ్చే విధానం.. రణదీప్ పై పూలు చల్లి నమస్కరించి మెడలో మల్లెపూల దండ వేయడం.. తన పక్కన కూర్చున్న వధువు మెడలో రణదీప్ మల్లెల మాల వేయడం.. ఏదో ఓ ఫాంటసీ నవల లో సీన్ లాగా ఉంది. ఈ పెళ్లి కోసం రణదీప్ తన కుటుంబ సభ్యులతో నిన్న ఇంపాలా చేరుకున్నారు. ఇలా ఇక్కడికి వచ్చి వీరి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం నిజంగా తనకు దక్కిన గౌరవం అని ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పారు.


అంతేకాదు ఈ పెళ్లి వేడుకల్లో తన జీవిత భాగస్వామి.. కుటుంబ సంప్రదాయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని అన్నాడు. జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న తలకు కేవలం రెండే రెండు కోరికలు ఉన్నాయని.. అందులో ఒకటి ఎక్కువ మంది పిల్లలు ఉండడం మరొకటి జీవితాన్ని సుఖసంతోషాలతో గడపడం అని రణదీప్ తెలిపాడు. బాలీవుడ్ లో రణదీప్ మంచి పేరు తెచ్చుకున్నాడు. రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘D’ రణదీప్ మొదటి హిందీ సినిమా. తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించిన రణదీప్ 2014లో సల్మాన్ ఖాన్ కిక్ మూవీలో కీలకమైన పాత్ర పోషించాడు. రీసెంట్గా అతను ‘సెర్జియంట్’ అనే వెబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×