Rashmi Gautam..విమర్శలకు చోటు ఇవ్వకుండా తన పను తాను చేసుకుంటూ పోయే అతి కొద్ది మందిలో యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) కూడా ఒకరు. ఈమె ఒక జంతు ప్రేమికురాలిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఎవరైనా జంతువులను బాధపెడుతున్నట్లు తన దృష్టికి వస్తే మాత్రం ఒక పట్టాన వదలదు. అంతలా జంతు ప్రేమికురాలిగా మంచి పేరు సొంతం చేసుకుంది. అందుకే రష్మీ గౌతమ్ విషయంలో అటు నెటిజెన్లు కూడా చాలా పాజిటివ్ గానే ఉంటారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్(Sudigali sudheer) తో ఉండే రిలేషన్ విషయంలో కూడా పాజిటివ్ గానే ఉంటారు. అయితే ఇప్పుడు ఆమెకు మాత్రం నెటిజన్స్ పెద్ద షాక్ ఇచ్చారని చెప్పవచ్చు.
సస్పెన్స్ గా మారిన రష్మీ – సుధీర్ బంధం..
అసలు విషయంలోకి వెళితే.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ , జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య ఏమి లేకపోయినా.. చాలా కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెరపై చూపించారు. ముఖ్యంగా జబర్దస్త్ షో వీరి మధ్యలో లవ్ ట్రాక్ ను పుట్టించిందని, అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎప్పుడు ఈ జంట కనిపించినా.. ఎప్పుడు వివాహం చేసుకుంటారు అని అడిగే వారే ఎక్కువ. కానీ వీరిద్దరూ మాత్రం లవ్ ట్రాక్ తో ఊగిసలాడుతున్నారు. తమ మధ్య రిలేషన్ విషయంలో దోబూచులాడుతూ ఉండడం గమనార్హం. ఇద్దరం లవర్స్ అని తేల్చడం లేదు.. అటు తమ మధ్య ఉన్న అనుబంధం ఏంటో కూడా చెప్పడం లేదు. ఫ్రెండ్స్ అని అంటే ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని అంటారు. దీంతో వీరి బంధం ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్ గా మారింది. తరచూ టీవీ షోలలో వీరి ప్రస్తావన వస్తోంది. అటు రష్మీ కూడా సుధీర్ ప్రస్తావన తెస్తూ.. షో కి హైప్ ఇస్తోంది. ఇటు షో టీఆర్పీ రేటింగ్ పెంచే ప్రయత్నం కూడా చేస్తోంది. అంతేకాదు ఇది చాలా కాలంగా నడుస్తోంది కూడా..
రష్మీ పై మండిపడుతున్న నెటిజన్స్..
ఇదిలా ఉండగా మరొకవైపు చాలా కాలం క్రితమే సుధీర్ జబర్దస్త్ ని వదిలేసాడు. కానీ అడపాదడపా ఆయన ప్రస్తావన రష్మీ తీసుకొస్తూనే ఉంది. ఇటీవల సంక్రాంతి షోలో కూడా వీరిద్దరూ కలిసి రచ్చ చేశారు. పాత రోజులను కూడా గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ రష్మీ సుదీర్ ప్రస్తావనను తీసుకురావడంతో అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. లవర్స్ డే స్పెషల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక షోని నిర్వహిస్తోంది. అందులో తన మనసులో ఉన్నవాడు, తన లవర్ గురించి రష్మీ బోర్డు మీద పేరు రాయాల్సి ఉంటుంది . దీంతో S అనే అక్షరం రాసి దోబూచులాడింది. దీంతో అందరూ సుడిగాలి సుదీర్ పేరే అయి ఉంటుందని భావిస్తున్నారు . అయితే అక్కడితో ప్రోమో అని కట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటివి ఎన్నో చూశాము. ఇవన్నీ టిఆర్పి రేటింగ్ కి సంబంధించిన స్టంట్స్ అంటున్నారు. తీరా చూస్తే అందులో ఏముండదని , వేరే ఎవరి పేరో రాస్తుందని, ఇలాంటివి ఎన్నో చూసామని ఎవరూ నమ్మకండి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రష్మీ ఇలాంటివి ఆపాలని అభిమానుల మనోభావాలతో ఆడుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఇకనైనా రష్మీ ఇలాంటివి ఆపుతుందేమో చూడాలి.