Thandel Movie First Review : నాగ చైతన్య కెరీర్‌లో భారీ మూవీ ‘తండేల్’. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు అయినట్టు సమాచారం. సాయి పల్లవి ఉండటం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ కాబోతుంది. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. అలా… సినిమాకు మంచి హైప్ కూడా వచ్చింది. ఈ నెల 7న రిలీజ్ కాబోతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందా..? అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది. అది ఇప్పుడు చూద్ధాం…
సాయి పల్లవి ఓ క్యారెక్టర్ చేస్తుంది అంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆమె లాస్ట్ మూవీ ‘గార్గీ’ గానీ, దానికి ముందు వచ్చిన ‘విరాటపర్వం’ గానీ… ఇంకా సాయి పల్లవి చేసిన మిగితా సినిమాల్లో కూడా ఆమె పాత్రలకు చాలా వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు రాబోయే తండేల్ మూవీలో కూడా సాయి పల్లవి పాత్రకే వెయిటేజ్ ఎక్కువ ఉందట.
తండేేల్ కథ విషయానికి వస్తే…
శ్రీకాకులంలో తండేల్ రాజు అనే మృత్సకారుడు… చేపల వేట కోసం గుజరాత్ తీర ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా… పాకిస్థాన్ జలభాగంలోకి వెళ్తాడు. దీంతో అక్కడ పాక్ ఆర్మీ వాళ్లను అరెస్ట్ చేస్తుంది. దీంతో తండేల్ రాజును పాక్ ఆర్మీ నుంచి విడిపించుకోవడానికి ఆయన భార్య పోరాటం చేస్తుంది. చివరికి కేంద్ర ప్రభుత్వం సాయంతో తండేల్ రాజు పాక్ ఆర్మీ చెర నుంచి బయటికి వస్తాడు. ఇదే కథ.
ఈ కథకు కొన్ని కమర్షియల్ హంగులు, ఒక మంచి లవ్ స్టోరీ ని జోడించి ‘తండేల్’ సినిమాను చేశారు. అయితే ఈ సినిమా చూసిన కొంత మంది ఇండస్ట్రీ పెద్దలు… రివ్యూ ఇస్తున్నారు.
ఎలా ఉందంటే..?
సినిమాలోని ఫస్టాఫ్‌లో హీరో – హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ ఉంటుందట. కొంత వరకు బాగానే అనిపించినా.. తర్వాత బోరు కొడుతుందట. లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ల్యాగ్ అయిన ఫీల్ వస్తుందట. సినిమాలో సముద్రం ఎక్కువ సార్లు కనిపిస్తుంది. అప్పుడు సినిమా చూసే ఆడియన్స్ “ఆ సముద్రం అలా అంత ఫాస్ట్ గా వెళ్తుంది. కానీ, సినిమా ఏంటి ఇంత స్లోగా వెళ్తుంది” అని అంటారట.
ఇక ఇంటర్వెల్ టైంలో కొంత వరకు ఆకట్టుకున్నా… సెకండాఫ్ లో కూడా అదే స్లో ఉంటుందట. సినిమాకు ఆయువు పట్టు అనుకునే పాకిస్థాన్ ఎపిసోడ్ కూడా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అనేలా ఉందని అంటున్నారు. ఇక సినిమా మొత్తం చూస్తే… ఆ క్లైమాక్స్ ఒక్కటే బెటర్ అని అంటున్నారు. 15 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందట. దాని వల్లే తండేల్ సినిమాకు మంచి మార్కులు పడుతాయని చెబుతున్నారు.
ఫర్ఫామెన్స్ ఇలా ఉంది..
ఇక ఫర్ఫామెన్స్ పరంగా చూస్తే నాగ చైతన్య పరవలేదు అనిపించుకుంటడట. కానీ, సాయి పల్లవి నుంచి ఎప్పటిలాగే డామినేటివ్ ఫర్ఫామెన్స్ ఉంటుందట. దీని వల్ల నాగ చైతన్య పెద్దగా కనిపించడు అని కూడా అంటున్నారు. మొత్తంగా అక్కినేని అభిమానులు ఈ సినిమా చూసి హిట్ అవుతుంది అని సంతోష పడాలో… లేదా… నాగ చైతన్య కంటే సాయి పల్లవికి ఎక్కువ క్రేజ్ వస్తుందో అని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.