E-Paper
Advertisement

Rashmika : రష్మిక డీప్ ఫేక్ నిందితుడు అరెస్ట్.. ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా గుర్తింపు..!

Rashmika : ప్రముఖ సినీనటి రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. గతంలో రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై గత ఏడాది నవంబరు 10న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Rashmika : రష్మిక డీప్ ఫేక్ నిందితుడు అరెస్ట్.. ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా గుర్తింపు..!
Advertisement
Rashmika latest updates

Rashmika latest updates(Telugu cinema news):

స్టార్ హీరోయిన్ రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. గతంలో రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై గత ఏడాది నవంబరు 10న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


దర్యాప్తులో కీలక అంశాలు పోలీసులు గుర్తించామని ఇటీవల పోలీసులు తెలిపారు. ఏయే ఐపీ అడ్రస్‌లు ద్వారా వీడియోను అప్ లోడ్ చేసారో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే వీడియో క్రియేట్‌ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ హేమంత్‌ తివారీ ప్రకటించారు. సోషల్‌ మీడియా నటి జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని పెట్టి వీడియోను పోస్ట్ చేశారు.

Advertisement

అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఢిల్లీ మహిళా కమిషన్‌ నుంచీ పోలీసులకు నోటీసులు వెళ్లాయి. తాజాగా సచిన్ టెండూల్కర్, సోనూ సూద్ సైతం బాధితులుగా మారారు. సైబర్ నేరగాళ్లు రాజకీయ, సినీ నటులను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×