BigTV English

Pushpa 2: నేషనల్ అవార్డు వస్తుందనుకుంటున్నా.. నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్స్ ..!

Pushpa 2: నేషనల్ అవార్డు వస్తుందనుకుంటున్నా.. నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్స్ ..!

Pushpa 2: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ‘గీతగోవిందం’ సినిమాతో మరింత ఇమేజ్ దక్కించుకుంది. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న రష్మిక మందన్న, అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప -2 (Pushpa -2) లో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar)కాంబినేషన్లో రాబోతోంది.


పుష్ప-2తో త్వరలో ప్రేక్షకుల ముందుకు..

ఇకపోతే 2021 లో అల్లు అర్జున్ , సుకుమార్, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పుష్ప’.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా సిద్ధమవుతున్న చిత్రం పుష్ప-2 (Pushpa-2). ఈ సినిమాతో తనకు జాతీయ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నటి రష్మిక.


IFFI 2024 వేడుకల్లో మెరిసిన రష్మిక..

ఇకపోతే గోవా వేదికగా జరుగుతున్న IFFI 2024 అవార్డు వేడుక ముగింపు పలికింది. ఇక ఈ ముగింపు వేడుకలలో గురువారం రష్మిక సందడి చేశారు. పుష్ప -2 ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఆమె ఇందులో పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకున్నారు. రష్మిక మాట్లాడుతూ.. పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా ఫైనల్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. మా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము అంటూ తెలిపింది రష్మిక.

జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా..

గతంలో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది కదా.. ఈసారి మీకు వస్తుందని అనుకుంటున్నారా ? అని ఒక విలేకరు ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. పుష్ప -2 సినిమాలో నా నటన కి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నాను అంటూ నవ్వులు పూయించారు .అంతేకాదు ఇదే సినిమాలోని ” సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉన్నాడే నా సామి” అనే పాటకి స్టేజిపై స్టెప్పులేసారు రష్మిక. అంతేకాదు ఆమె మాట్లాడుతూ.. ఇది యాక్షన్ సినిమా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది ఒక ఎమోషనల్ రైడ్ లాగా ఉంటుంది . ఇందులో ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంటుంది.. అదే సినిమాలో కీలకమైన అంశం అంటూ తెలిపింది.

పుష్ప సినిమా స్టోరీ..

ఒక పుష్ప స్టోరీ విషయానికి వస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దీనిని రెండు భాగాలుగా సిద్ధం చేశారు డైరెక్టర్ సుకుమార్.ఇప్పటికే 2021లో ‘పుష్ప :ది రైస్’ విడుదల కాగా.. అందులో పుష్పరాజ్ ఒక సాధారణ కూలీ నుంచి ఎర్రచందనం సిండికేట్ కి నాయకుడిగా ఎలా మారాడు..? అనే విషయాన్ని చూపించారు. దీనికి కొనసాగింపుగా సిద్ధమైన పుష్ప: ది రూల్ డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది .ఇకపోతే ఇందులో భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎలా అడుగు పెట్టాడు? బన్వర్ సింగ్ షెకావత్ నుంచి ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో ఇది ఉండనుంది అని సమాచారం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×