White Hair: చిన్న వయస్సులోనే జుట్టు నెరవడం అనేది సాధారణ సమస్యగా మారింది. వయస్సు పెరగడానికి సంకేతంగా భావించే తెల్ల జుట్టు ఈ రోజుల్లో సర్వసాధారణమైన సమస్యగా మారింది. అయితే దీని వెనుక కారణాలు అసలు కారణాలు ఏంటో తెలుసా ?
తెల్ల జుట్టు సాధారణంగా వృద్ధాప్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది. కానీ ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సు రాకముందే జుట్టు రంగు మారడానికి కారణాలు అనేక కారణాలు ఉంటాయి. మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపంతో పాటు అనేక కారణాలు ఉంటాయి. ప్రతి రోజు పాటించే కొన్ని రకాల అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా ఈ సమస్య నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
తెల్ల జుట్టు రాగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అంతే కాకుండా తెల్లజుట్టు రంగు మార్చుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో పెద్దగా ఫలితం కూడా ఉండదు. అందుకే నేచురల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ తప్పకుండా వాడాలి.
జుట్టు రంగు మారడానికి కారణాలు:
ఒత్తిడి,ఆందోళన- నేటి బిజీ లైఫ్ లో ఒత్తిడి , ఆందోళన సర్వసాధారణం. ఈ రెండూ జుట్టు తొందరగా నెరసిపోవడానికి ముఖ్యమైన కారణాలు.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ , న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టుకు హాని కలిగుతుంది.
నిద్ర లేకపోవడం- తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ఇది జుట్టు నెరసిపోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
పర్యావరణ కాలుష్యం- కాలుష్యం జుట్టును దెబ్బతీస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టు రావడానికి కూడా కారణం అవుతుంది.
జన్యుపరమైన కారణాలు- కొంతమందిలో, జుట్టు త్వరగా నెరిసిపోవడం జన్యుపరమైన కారణాల వల్ల కూడా కావచ్చు.
కొన్ని రకాల మందుల వాడకం – కొన్ని రకాల మందులు వాడకం కూడా జుట్టు నెరసిపోవడానికి కారణమవుతుంది.
జుట్టు అకాల బూడిదను ఎలా నివారించాలి ?
ఒత్తిడిని తగ్గించండి- యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి – పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
పూర్తి నిద్ర పొందండి- రోజు కనీసం 7-8 గంటల నిద్ర తీసుకోండి.
Also Read: జుట్టు రాలుతోందా ? ఇలా చేస్తే.. సమస్య దూరం
పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి- కలుషిత ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి. ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్లను తప్పకుండా వాడండి .
జుట్టును జాగ్రత్తగా చూసుకోండి- క్రమం తప్పకుండా జుట్టును వాష్ చేయండి. మంచి సల్ఫేట్ లేని షాంపూ, కండీషనర్ ఉపయోగించండి.
వైద్యుడిని సంప్రదించండి- మీ జుట్టు వయస్పు కంటే ముందే రంగు మారుతున్నట్లు మీకు అనిపిస్తే, నిపుణులను సంప్రదించండి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.