BigTV English

Rashmika Madanna: మై డార్లింగ్స్.. విజయ్ దేవరకొండ.. పార్టీ కావాలి

Rashmika Madanna: మై డార్లింగ్స్.. విజయ్ దేవరకొండ.. పార్టీ కావాలి


Rashmika Madanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అమ్మడిని నేషనల్ క్రష్ గా మార్చింది మాత్రం గీతగోవిందమే. ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ తో ఈ చిన్నది  సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోనే రష్మికకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి.. ప్రేమ వరకు వచ్చిందని బయట టాక్. కానీ, తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ జంట ఎన్నోసార్లు చెప్పుకొస్తూనే ఉంది. ఇక ఫ్రెండ్స్ లానే విజయ్ – రష్మిక ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్ గా ఉంటారు. రష్మిక నటించిన ఏ సినిమాకు అయినా విజయ్ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. రష్మిక కూడా అంతే. ముఖ్యంగా ది ఫ్యామిలీ స్టార్  ఆమెకు ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. గీతగోవిందం తెరకెక్కించిన దర్శకుడు పరశురామే.. ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ కాబట్టి.

ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. తాజాగా రష్మిక ఈ ట్రైలర్ ను షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపింది. “మై డార్లింగ్స్.. పరుశురామ్ , విజయ్ దేవరకొండ  ఫ్యామిలీ స్టార్ మీకు బెస్ట్ సినిమా కావాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 5 న వస్తుంది.. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా..  మీరు కచ్చితంగా ఒక విజయాన్ని చేతిలో పెట్టేసుకున్నారు. పార్టీ కావాలి. మృణాల్.. ఆల్ ది బెస్ట్ ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


ఇక రష్మిక సినిమాల సంగతి గురించి మాట్లాడితే.. ప్రస్తుతం రష్మిక చేతిలో పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం చేస్తుంది. ఇవి కాకుండా ధనుష్ సరసన కుబేరలో కూడా అమ్మడే హీరోయిన్. మరి ఈ సినిమాలతో రష్మిక ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

 

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×