BigTV English

Rashmika Mandanna : ఫోర్బ్స్ జాబితాలో రష్మిక మందన్న.. ఫస్ట్ ప్లేస్ లో నేషనల్ క్రష్

Rashmika Mandanna : ఫోర్బ్స్ జాబితాలో రష్మిక మందన్న.. ఫస్ట్ ప్లేస్ లో నేషనల్ క్రష్

Rashmika Mandanna gets top place in forbes list : పుష్ప సినిమాలో శ్రీవల్లిగా కనిపించి.. అందరి చూపుని తనవైపు తిప్పుకుని.. నేషనల్ క్రష్ గా ఫేమస్ అయిన రష్మిక మందన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవలే యానిమల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె.. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్ ను సంపాదించుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతిఏడాది వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి.. వారిపేర్లను ప్రకటిస్తుంది. అలా ఈ ఏడాది ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లిస్ట్ లో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.


Read More : భామాకలాపం 2.. కష్టాల్లో ఉన్న ప్రియమణి గట్టెక్కిందా ?

ఈ విషయాన్ని రష్మిక మందన్న X వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం రష్మిక మందన్న ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పుష్ప-2 లో నటిస్తోంది. పుష్ప-1 కు ఇది సీక్వెల్. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాలు చేస్తోంది.


ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పిన రష్మిక.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ వస్తుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ, సరిలేరు నీకెవ్వరు, సుల్తాన్, పొగరు, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతారామం, యానిమల్.. ఇలా వరుసగా రష్మిక నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి.

Read More : ‘రాజధాని ఫైల్స్‌’ .. రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్..‌

కాగా.. గతేడాది రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. కేంద్రం కూడా దీనిపై సీరియస్ అయింది. ఆ తర్వాత వరుసగా.. ఇతర నటీమణులు కూడా డీప్ ఫేక్ ను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకుంటారన్న రూమర్లు గుప్పుమన్నాయి. ఈ రూమర్లపై ఇద్దరిలో ఎవరూ స్పందించకపోవడంతో.. అదే నిజమై ఉంటుందని, అందుకే ఎవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు.

సినీ ఇండస్ట్రీ నుంచి రష్మికతో పాటు మరో నటి కూడా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. రాధిక మదన్ .. గతేడాది సాస్.. బహు ఔట్ ఫ్లెమింగో సిరీస్ తో తన సత్తా చాటింది. ప్రస్తుతం హిందీలో సనా, సర్ఫిరా చిత్రాల్లో నటిస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×