HCA Coach Jai Simha Misbehavior With Women Cricketers: హైదరాబాద్ క్రికెట్ బోర్డును మరో వివాదం చుట్టుకుంది. మహిళల జట్టు ప్రధాన కోచ్ విద్యుత్ జైసింహపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. టీమ్ బస్సులో వెళుతున్న సమయంలో మందు కొడుతూ అసభ్యంగా ప్రవర్తించారని మహిళా క్రికెట్లు ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇప్పటికే బాధిత క్రికెటర్లు జైసింహపై హెచ్ సీఏ కు కంప్లైంట్ చేశారు. ప్రధాన కోచ్ జైసింహపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆయనకు మద్దతుగా నిలిచిన సెలక్షన్ కమిటీ మెంజర్ పూర్ణమారావుపై కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
Read More: వావ్ ! కేన్ మామా.. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలతో చరిత్ర!
ఇటీవల మ్యాచ్ ఆడేందుకు మహిళల టీమ్ విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉంది. కానీ హెడ్ కోచ్ జైసింహ కావాలనే ఆలస్యం చేశారనేది మహిళా క్రికెటర్ల ఆరోపణ. విమానం మిస్ కావడంతో బస్సులోనే హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో జైసింహ.. మందు తాగుతూ తమపై అసభ్య పదజాలం ప్రయోగించారని మహిళా క్రికెటర్లు ఆరోపించారు.
మహిళా క్రికెట్ జట్టుకు విద్యుత్ జైసింహ హెడ్ కోచ్‌గా ఉన్నారు. నిత్యం మద్యం మత్తులో ఉంటారని క్రికెటర్ల ఆరోపణ. అసభ్యంగానూ ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. తమ పిల్లల భద్రతపై మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జైసింహ ప్రవర్తనను తప్పుపడితే వార్నింగ్ ఇస్తున్నారని బాధిత క్రికెటర్లు చెబుతున్నారు. పోలీసు అధికారుల పేర్లు, మాజీ రంజీ ఆటగాళ్ల పేర్లు చెప్పి
బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెడ్ కోచ్ జైసింహ, సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు కోరుతున్నారు. ఈ ఘటనపై HCA స్పందించింది. హెడ్ కోచ్ జైసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించింది.