Rashmika Mandanna: కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ‘గీతాగోవిందం’ సినిమా చేసి.. ఆ సినిమాలో తన అమాయకత్వంతో, కోపంతో, చిలిపితనంతో,ఒక ఫ్యామిలీ లేడీగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తర్వాత మహేష్ బాబు (Maheshbabu) హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అవకాశాన్ని అందుకొని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. అలా వచ్చిన క్రేజ్ తో తమిళ్లో కూడా చిత్రాలు చేసి పాపులారిటీ అందుకున్న ఈమె.. ఈమధ్య ఎక్కువగా బాలీవుడ్లో సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటోంది.
ఇకపోతే గత ఏడాది వచ్చిన ‘యానిమల్’, ‘పుష్ప 2’ చిత్రాలతో పాటు ఈ ఏడాది వచ్చిన ‘ఛావా’ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ మూడు చిత్రాలతో రెండేళ్లలోనే రూ.3,300 కోట్లు రాబట్టిన హీరోయిన్గా కూడా రికార్డు క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.4 నుండి రూ.8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా అటు ఆస్తులను కూడా పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక ఆస్తులు ఎంత అనే వివరాలు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
Prabhas: బిజిమెన్ డాటర్ తో త్వరలో డార్లింగ్ పెళ్లి.. రహస్యంగా కానిచ్చేస్తున్న శ్యామలాదేవి..!
వైరల్ గా మారిన రష్మిక మందన్న ఆస్తుల వివరాలు..
రష్మిక మందన్న.. కుర్రాళ్ళ ఆరాధ్య దేవి అయిన నేషనల్ రష్మిక మందన్న వయసు 28 సంవత్సరాలు. కానీ ఆమె ఆస్తుల వివరాలు చూస్తే మాత్రం.. గుండె గుభేల్ అనాల్సిందే. ఫోర్బ్స్ ఇండియా రిపోర్టు ప్రకారం.. ఆమె నికర ఆస్తులు విలువ సుమారుగా రూ.66 కోట్లు ఉంటుందని సమాచారం. అటు సినిమాలతో పాటు యాడ్స్, ఎండార్స్మెంట్లు, ఇంస్టాగ్రామ్ లో ప్రమోషన్లతో భారీగా సంపాదిస్తోంది. అంతేకాదు పలు ప్రైవేట్ సంస్థలతో పాటూ జ్యువెలరీ సంస్థలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె.. వీటి ద్వారా వచ్చిన డబ్బుతో భారీగా బంగ్లాలు నిర్మించినట్లు సమాచారం. రష్మికాకు ప్రస్తుతం బెంగళూరులో రూ. 8 కోట్ల విలువ చేసే విలాసవంతమైన బంగ్లాతో పాటు కూర్గ్, గోవా, హైదరాబాద్ , ముంబై వంటి ప్రాంతాలలో కూడా ఖరీదైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
రష్మిక మందన్న కార్ కలెక్షన్..
ఇక హై ఎండ్ ఆటోమొబైల్స్ అభిమాని అయిన ఈమె ఆడి క్యూ 3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ వంటి లగ్జరీ కార్లు ఈమె సొంతం. మొత్తానికి అయితే 28 సంవత్సరాల వయసులోనే ఈ రేంజ్ లో ఆస్తులు కూడుబెట్టడం అంటే మామూలు విషయం కాదని.. ఈమె లేడీ కుబేర అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘కుబేర’, ‘రెయిన్బో’ వంటి చిత్రాలలో నటిస్తోంది. మరొకవైపు హిందీలో సల్మాన్ ఖాన్(Salman Khan) సరసన ఈమె నటించిన ‘సికిందర్’ సినిమా కూడా విడుదల కాబోతోంది.