Railway Rush Stampedes| రైలు ప్రయాణం చేసే వారు రిజర్వేషన్ లేకపోతే ఎంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా జెనరల్ టికెట్ తీసుకున్నవారికైతే చాలా సార్లు కూర్చోవడానికి కాదు కదా.. నిలబడడానికి కూడా చోటు దక్కదు. ఇక నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ.. స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవసరమైనప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భారతీయ రైల్వే శాఖ.. జెనరల్ టికెట్ ప్రయాణికుల కష్టాలు తగ్గించడానికి, పండుగలు, ఇతరత్రా సీజన్ ప్రయాణాల సమాయాల్లో భారీ రద్దీ కారణంగా రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట ఘటనలు నివారించడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
జనం రద్దీ కారణంగా తొక్కిసలాట ఘటనలు
ఇటీవలి కాలంలో రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. ఈ దుర్ఘటనల కారణంగా చాలా మంది ప్రయాణికులు చనిపోవడం విషాదకరం. మహాకుంభమేళా సందర్బంగా ఒక రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి.. 18 మంది చనిపోయారు. దీంతో రైల్వే శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకోసం రైల్వే శాఖ ఈ సమస్యపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించింది. రైల్వే మంత్రిత్వశాఖ ప్రకారం.. రైల్వే ప్లాట్ ఫామ్స్ పై ట్రైన్ రాకముందు భారీగా జనం గుమిగూడుతున్నారు. వీరిలో రిజర్వేషన్ ఉన్నవారి కంటే రిజర్వేషన్ లేని వారు అంటే జెనరల్ టికెట్ కల ప్రయాణికుల సంఖ్య అపరిమితంగా ఉంటోంది. ఈ అపరిమిత సంఖ్య వల్లే తొక్కిసలాట ఘటనలు జరిగే అవకాశాలున్నాయి. అందుకే వీటిని నివారించడానికి కొత్తగా ఏర్పాట్లు చేయనుంది. వీటిని ముందుగా ఢిల్లీ, ముంబై, సూరత్, పుణె లాంటి ప్రధాన నగరాల్లో అమలు చేయబోతోంది.
ప్లాన్ 1: ట్రైన్ లేట్ అయితే ప్రత్యేక రైళ్లు
ప్రధాన నగరాలకు వెళ్లే రైలు మార్గాల్లో ట్రైన్ ఆలస్యమైనప్పుడు ఆ మార్గంలోని రైల్వే స్టేషన్లలో ఆలస్యమైన ట్రైన్ తో పాటు మిగతా ట్రైన్స్ కోసం ఎదురు చూసే ప్రయాణికలు కూడా ఉంటారు. దీంతో రైల్వే స్టేషన్స్ లో రద్దీ ఎక్కువవుతుంది. ఈ రద్దీని నివారించడానికి ఆలస్యమైన ట్రైన్ కు బదులు ఒక ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. దేశంలో ముఖ్యంగా పట్నా, హాజీపూర్, నుంచి కాన్పూర్, అలహాబాద్, వారణాసి నగరాల మధ్య రాకపోకలు చేసే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. ఈ మార్గాలలో తరుచూ ట్రైన్లు ఆలస్యమవుతూ ఉంటాయి. అందుకే ఈ మార్గాల్లో నడిపేందుకు అదనపు ట్రైన్లు రిజర్వ్ గా కేటాయించాలని భావిస్తోంది రైల్వే శాఖ.
Also Read: కశ్మీర్‌ను ఇక రైల్లో చుట్టేయొచ్చు.. ఏయే ప్రాంతాలను చూడొచ్చు అంటే?
ప్లాన్ 2: జెనరల్ కోచ్ టికెట్ల విక్రయాలు తగ్గించడం
ప్రస్తుతం రైల్వే స్టేషన్ లలో జెనరల్ టికెట్ల విక్రయానికి పరిమితి లేదు. ఈ ట్రైన్ లో ప్రయాణించాలన్నా.. అందులో జెనరల్ టికెట్ ఎంతమంది అయినా తీసుకోవచ్చు. దీంతో ప్రయానికులు కూర్చోవడానికి, నిలబడడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారు. అందుకే రైల్వే శాఖ ఈ సమస్యను పరిష్కరించడానికి జెనరల్ టికెట్ విక్రయాలు పరిమితం చేయాలని భావిస్తోంది. అందుకోసం ఒక ట్రైన్ లో జెనరల్ సీట్ల సంఖ్య కంటే అత్యధికంగా 50 శాతం ఎక్కువ టికెట్లు విక్రయించాలనే ప్రతిపాదించింది. ఈ ప్లాన్ అమలు పరిస్తే.. ప్రయాణికులు రద్దీ సమస్య ఉండదని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో పాటు ప్లాట్ ఫామ్ పై వచ్చేవారి సంఖ్య కూడా తగ్గించాలని సూచిస్తున్నారు.
ప్లాన్ 3: ట్రైన్ పేరు ముద్రించిన టికెట్లు విక్రయం
జెనరల్ టికెట్ కొనగోలు చేసేవారికి ఒక ట్రైన్ లో ప్రయాణించేందుకు టికెట్ మరొక ట్రైన్ లో ప్రయాణించే సౌలభ్యం ఉంటుంది. అలా కాకుండా టికెట్ ఆ ప్రత్యేక ట్రైన్ లో ప్రయాణించేందుకు మాత్రమే విక్రయించాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. అంటే టికెట్ పై ట్రైన్ పేరు, నెంబర్, ప్రయాణ సమయం ఈ వివరాలన్నీ ముద్రించి ఉంటాయి. ఈ సమాచారం ఉండడంతో ప్రయాణికులు అనసరంగా రైల్వే ప్లాట్ ఫామ్ పై రాకుండా నివారించవచ్చునని అధికారులు భావిస్తున్నారు.