Rashmika Mandanna.. పాత సంవత్సరం పూర్తయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఇక సెలబ్రిటీలంతా కూడా చాలా గ్రాండ్ గా న్యూ ఇయర్ కి శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని తెలియజేశారు. కొత్త ఏడాదిలో జీవితం మరింత సంతోషంగా సాగిపోవాలని కూడా కోరుకుంటున్నారు. ఇక గత జ్ఞాపకాలను పదిలం చేసుకొని కొత్త ఏడాది అందించే జ్ఞాపకాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి మధుర జ్ఞాపకం నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి కూడా ఏదైనా ఉందా అంటే? ఉందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. డిసెంబర్ 30వ తేదీని తన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.
ఎప్పటికీ ఆరోజు ప్రత్యేకం..
ఆరోజు ఈమె నటించిన తొలి సినిమా విడుదలైన రోజు కావడంతో జీవితాంతం అదొక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయిందని తెలిపింది. అదే సినిమా ఆమె జీవితాన్ని కూడా మార్చేసింది అని కూడా చెబుతోంది రష్మిక. ఇక నేడు నేషనల్ క్రష్ గా నీరాజనాలు అందుకుంటోంది అంటే ఈ సినిమా అందించిన విజయంతోనే సాధ్యమైందని కూడా చెప్పుకొచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే, ఈమె నటించిన తొలి కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’.. అందులో హీరోయిన్ గా నటించింది రష్మిక. రక్షిత్ శెట్టి(Rakshith Shetty)హీరోగా నటించారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి(Rishab Shetty)దర్శకత్వం వహించారు.
మాజీ ని గుర్తు చేసుకున్న రష్మిక..
ఇకపోతే ‘కిరిక్ పార్టీ’ సమయంలోనే రక్షిత్ శెట్టి తోనే ఈమె ప్రేమలో పడింది. చాలా కాలం ప్రేమించుకుని ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉన్నప్పుడు ఈమె టాలీవుడ్ లో ‘ఛలో’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నటిగా తెలుగులో బిజీ అవడం, కొన్నాళ్లకు రక్షిత్ తో ప్రేమాయణం కూడా వికటించింది. ఆ తర్వాత నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. కెరియర్ కోసమే అతడికి దూరమైంది అనే విమర్శలు కూడా ఎదుర్కొంది. చివరికి రక్షిత్ అభ్యర్థన మేరకు విమర్శలకు కాస్త పులిస్టాప్ పడిందని చెప్పవచ్చు.
పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి..
ఇకపోతే రష్మిక ఇలా తన మొదటి సినిమా గురించి చెప్పి మరొకసారి తన మాజీ ప్రియుడిని గుర్తుచేసుకుందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇదంతా ఒకప్పటి విషయం.. ఇప్పుడు రష్మిక కెరియర్ చాలా దేదీప్యమానంగా సాగిపోతోంది. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో ఫేమస్ అయిపోయింది. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 తో ప్రత్యేకమైన ఇమేజ్ కూడా లభించిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవరకొండ (Vijay deverakonda) తో ప్రేమలో పడిందని, అతడిని వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ప్రేమ , పెళ్లి ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది . ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లడమే కాదు కలిసి ఒకే చోట కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.