Australia Playing XI: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా ( జనవరి 3) రేపు ఉదయం నుండి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చివరి టెస్ట్ లో గెలిచి డబ్ల్యూటీసి ఫైనల్ కి చేరుకోవాలని వ్యూహాలు రచిస్తుంది ఆస్ట్రేలియా జట్టు. గత నాలుగు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ గెలిచి.. మరో రెండు మ్యాచ్ లు ఓడిన భారత జట్టు.. గబ్బా వేదికగా జరిగిన మూడవ టెస్ట్ ని డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read: Irfan Pathan: రెండుగా చీలిన టీమిండియా… డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్..?
మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో భారత జట్టు ఓటమి చెందడంతో డబ్ల్యూటీసి ఫైనల్ చేరే అవకాశాలు కూడా సంక్లిష్టమయ్యాయి. ఇక ఆసిస్ 2 – 1 తో ఆదిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే చివరి మ్యాచ్ లో కూడా గెలిచి.. భారత జట్టు సిరీస్ ని సమం చేయకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా వ్యూహాలు రచించిస్తోంది. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్ట్ కి తమ తుది జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. వరుసగా నాలుగు మ్యాచ్ లలో విఫలమైన స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పై ఆస్ట్రేలియా టీం మేనేజ్మెంట్ వేటు వేసింది.
అతడి స్థానంలో డేంజర్ బ్యాట్స్మెన్, ఆల్ రౌండర్ బ్యూ వెబ్ స్టర్ కి తుది జట్టులో స్థానం కల్పించింది. ఈ మ్యాచ్ తోనే వెబ్ స్టర్ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటివరకు 93 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వెబ్ స్టర్ 5297 పరుగులు చేశాడు. అలాగే 148 వికెట్లు పడగొట్టాడు. ఇక నాలుగోవ టెస్టులో పక్కటెముకల నొప్పితో బాధపడ్డ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమీన్స్ ( కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్ స్టాస్, లబుషేన్, స్టేవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, వెబ్ స్టర్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్. ఇక ఈ సిరీస్ లో ఇప్పటికే 2 – 1 తో వెనకంజలో ఉన్న భారత జట్టుకి మరో షాక్ తగిలింది. పేసర్ ఆకాష్ దీప్ నడుమునొప్పి కారణంగా రేపటి నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభమయ్యే ఐదవ టెస్ట్ కి దూరం కానున్నట్లు కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు.
Also Read: Glenn Maxwell’s Catch: మాక్స్ వెల్ క్రేజీ క్యాచ్..బిత్తరపోయిన బ్యాట్స్ మెన్ !
ఈ సిరీస్ లో పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాష్.. కీలకమైన సిడ్ని టెస్ట్ కి దూరం కావడం భారత జట్టుకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఆకాష్ స్థానంలో హర్షిత్ రానా ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చివరి టెస్ట్ లో భారత జట్టు పేస్ బౌలర్ బూమ్రాని ఓ ఆల్ టైం రికార్డ్ ఊరిస్తుంది. ఈ టెస్ట్ లో బూమ్రా మరో 6 వికెట్లు తీస్తే.. ఓ ద్వైపాక్షి క టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ గా రికార్డు నెలకొల్పుతాడు.