BigTV English

Horoscope scorpio 2025 :  వృశ్చిక రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

Horoscope scorpio 2025 :  వృశ్చిక రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

Horoscope scorpio 2025 :   గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. వృశ్చిక రాశి  జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం వృశ్చిక రాశి  జాతకులకు ఆదాయం -2, వ్యయం-14గా ఉంది. అంటే రెండు రూపాయలు సంపాదిస్తే  పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు.   ధన పరంగా వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇక రాజ్యపూజ్యం-5,  అవమానం -2 గా ఉంది. అంటే  అయిదు మంది మీకు గౌరవం ఇస్తే.. ఇద్దరు మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


జనవరి : వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో ప్రతి పనియందు ఆటంకములు ఏర్పడతాయి. అకాల భోజనము, అకాల నిద్ర వలన అనారోగ్యములు కలుగును. సంతానం లేనివారికి సంతానం కలుగును. స్త్రీ సౌఖ్యం, కుటుంబంలో శాంతి, వ్యవసాయ, వ్యాపారులకు ధనలాభం కలుగును.

ఫిబ్రవరి : వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో  శత్రువుల వలన బాధలు గతం కంటే కాస్త తగ్గుతాయి.  మెడిసిన్స్‌ కు  డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.  కుటుంబంలోని వారందరు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు.


మార్చి: వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో  బంధు మిత్రులు శత్రువులుగా వ్యవహరిస్తారు. అన్ని రంగముల వారికి లాభించును. వ్యాపారములు అనుకూలంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితులు చక్కబడతాయి. ట్రావెల్స్, టూరిజం వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది.

ఏప్రిల్ : వృశ్చిక రాశి జాతకులు ఈ నెలలో  దూర ప్రయాణములు చేస్తారు. ఇంట్లో  అనేక అభివృద్ధి పనులు చేస్తారు. భాద్యతతో వ్యవహరించి తగిన ప్రతిఫలం పొందుతారు. ధనలాభం, సర్వసుఖం, మనశ్శాంతి కల్గును.

మే : వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో  తల పెట్టిన పూర్తి చేస్తారు. వస్త్ర, ధన, ధాన్య లాభం కలుగుతుంది. మీ క్రింద పనిచేసే వారిపై ద్వేషం పెంచుకోవద్దు. అన్ని రంగముల వారికి అనుకూలమైన నెల ఇది.

జాన్ : వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో  స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ములకు మాటామాటా వచ్చును. చేతిపనివాళ్లకు కొంతమేర పనులు కలసి వస్తాయి.    ప్రతి పనిలోను ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇష్ట దైవ ప్రార్థన చేయాలి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

జూలై : వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో  గృహ నిర్మాణము చేయడానికి లేదా కొనడానికి అవకాశం ఉంది. సేవకుల, మూలక ధన నష్టం, మానసిక ఆందోళనలు ఉన్నాయి.

ఆగష్టు : వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో   కీర్తి, గౌరవం, సర్వతోముఖాభివృద్ధి కలుగును. ఉద్యోగముల యందు విశేష అభివృద్ధి జరుగును. అన్ని విధాల శుభదాయకంగా ఉండును. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.

సెప్టెంబర్ : వృశ్చిక రాశి జాతకులు ఈ నెలలో  అలంకారముల కొరకు అధిక ధనమును ఖర్చు చేస్తారు.  బంధు మిత్రులతో ఆనందముగా గడుపుతారు. యంత్ర పరిశ్రమ, న్యాయవాదులు, వైద్యులు, నటులు, గాయకులకు అనువైన కాలం.

అక్టోబర్ : వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో  ధనము విపరీతంగా ఖర్చు అవ్వడంతో బాటు అంతే ఆర్థిక వనరులు సమకూరి ధనాదాయం పెరుగుతుంది. అప్రయత్న కార్యముల వలన ధనప్రాప్తి కలుగుతుంది.  యంత్ర పరిశ్రమలు వారు బాగా రాణిస్తారు.

నవంబర్: వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో  ధనలాభం ఉంది.  విద్యా పరిశోధన విషయాల్లో రాణిస్తారు. భోగభాగ్యాలు కలసి వస్తాయి. యంత్ర పరిశ్రమలు న్యాయవాదులు వైద్యులు నటులకు గాయకులకు తమ వ్యక్తిగత బలముచేత రాణిస్తారు.

డిసెంబర్: వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో  క్రూరత్వము ప్రదర్శించుట, నీచత్వమునకు దిగజారుట చేస్తారు.  స్త్రీ మూలక సౌఖ్యము, లాభము గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిపుష్టి భోగం సుఖం సేవకుల మూలక ధననష్టం ఉంటుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×