Brydon Carse – SRH: భారత్ – ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత రెండవ టి-20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై టీమిండియా గెలుపొందింది. దీంతో ఐదు టి-20 సిరీస్ లో 2-0 తో భారత్ ఆదిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది.
Also Read: Tilak Varma: తెలుగోడు సరికొత్త చరిత్ర…కోహ్లీ, మార్క్ చాప్మన్ రికార్డు బద్దలు !
జాకబ్ బెతెల్, గస్ అట్కిన్సన్ ల స్థానంలో బ్రైడెన్ కార్స్, జెమీ స్మిత్ లను జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే మొదటి టీ-20 లో బ్యాటర్ల వైఫల్యంతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. ఈ రెండవ టి-20 లో భారీ స్కోర్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అనుకున్న విధంగానే ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మొదటి బంతిని బౌండరీకి తరలించాడు. అయితే అర్షదీప్ వేసిన అదే మొదటి ఓవర్ లో సాల్ట్ ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత బెన్ డకెట్ కూడా మూడు పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. మొదటి మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా కెప్టెన్ జోష్ బట్లర్ జట్టు ట్రబుల్ షూటర్ గా మారాడు. 45 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు అతనికి సహకరించలేదు. చివరగా వచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆల్ రౌండర్ బ్రైడెన్ కార్స్ 17 బంతులలో 31 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇతడికి జెమీ స్మిత్ సహకారం అందించడంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
మొదటి మ్యాచ్ తో పోలిస్తే ఈ మ్యాచ్ లో ఓ మెరుగైన లక్ష్యాన్ని నిలిపింది ఇంగ్లాండ్ జట్టు. అయితే బ్రైడెన్ కార్సే ఈ మ్యాచ్ లో దురదృష్టవశాత్తు రన్ అవుట్ తో వెనుదిరిగాడు. అంతేకాదు ఇతడు బౌలింగ్ లోను అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు వికెట్లు పడగొట్టి ఓ దశలో మ్యాచ్ ని ఇంగ్లాండ్ వైపు మలుపు తిప్పాడు. కేవలం 29 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, దృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ లను అవుట్ చేయడంతో భారత టాప్ మరియు మిడిల్ ఆర్డర్ ను పడగొట్టాడు.
Also Read: Ind vs Eng T20: టీమిండియా కు బిగ్ షాక్… రింకూ, నితీష్ ఇద్దరూ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్??
ఐపీఎల్ 2025 మెగా వేలంలో కార్సే ని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. కేవలం ఒక కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో ఈ ఆల్రౌండర్ మొట్టమొదటి సీజన్ ని ఆడబోతున్నాడు. ఈ క్రమంలో పాట్ కమీన్స్ నేతృత్వంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మరో ఆల్రౌండర్ దొరికాడంటూ కామెంట్స్ చేస్తున్నారు హైదరాబాద్ అభిమానులు.
Brydon Carse is a some talent. He is a very good lower order batter, bowls with great pace and has a knack for breaking partnerships. Overall, he is a complete package. SRH fans must be smiling, it might be early to say but he can easily fit into the number 7 role. pic.twitter.com/iBf3YQR5Gk
— Vijay Anaparthi (@VijayCricketFan) January 25, 2025