BigTV English

Rashmika Mandanna : నా వల్ల అల్లు అర్జున్ కు దెబ్బలు తగిలాయి.. రక్తం కారుతున్న పట్టించుకోలేదు..

Rashmika Mandanna : నా వల్ల అల్లు అర్జున్ కు దెబ్బలు తగిలాయి.. రక్తం కారుతున్న పట్టించుకోలేదు..

Rashmika Mandanna : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ పుష్ప 2.. రీసెంట్ గా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది.. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. నార్త్ లో వరుసగా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఇక కలెక్షన్లతో పాటు అదే స్థాయిలో వివాదాలు కూడా ఈ సినిమా చుట్టుముడుతున్నాయి.. ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల.. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇలా పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాదు. రష్మిక మందన్న కూడా టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది.. తాజాగా ఈమె అల్లు అర్జున్ గురించి ఓ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక మందన్న చురుగ్గా పాల్గొన్నారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడానికి కారణం హీరో, హీరోయిన్ చేసిన ప్రమోషన్స్ కారణమని అందరు అంటున్నారు. పుష్ప 2 విజయంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక కూడా కీలకపాత్ర పోషించారు. ఆమె పోషించిన శ్రీవల్లి క్యారెక్టర్ లైఫ్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. భర్త అంటే ప్రాణం ఇచ్చే భార్యగా, తన భర్త పై ఈగ వాలనివ్వని క్యారెక్టర్‌లో రష్మిక అద్భుతంగా నటించారు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత రష్మిక హైలెట్ గా నిలిచింది.. అంతేకాదు గతంలో వచ్చిన పుష్ప మూవీ తో పోలిస్తే ఈ మూవీలో రష్మిక గ్లామర్ డోస్ కాస్త ఓవర్ గానే ఉందనే టాక్ ను అందుకుంది. చీరకట్టులో పద్ధతిగా కనిపిస్తూనే రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది.. పుష్ప 2 భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచారు. అంతేకాదు.. రెమ్యూనరేషన్ కూడా భారీ పెంచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. మొన్న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అల్లు అర్జున్ లాగా చీర కట్టుకొని ఏ యాక్టర్ నటించడు అంటూ ఆకాశానికి ఎత్తేసింది. అడ్డంగా ఇరుక్కుంది. నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.. ఇప్పుడు కూడా సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. పీలింగ్ సాంగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పాట చేసే సమయంలో తనకు అసౌకర్యంగా అనిపించిందని ఆమె అన్నారు. నన్ను ఎవరైనా అమాంతం పైకి ఎత్తితే తనకు చాలా భయమని.. ఇది నాకున్న ఫోబియా అని రష్మిక చెప్పారు. ఆ సాంగ్ మొత్తం బాగా భయపడ్డాను అని చెప్పింది. ఇక ఈ సాంగ్ షూటింగ్ సమయంలో నా చేతి గాజులు తగిలి అల్లు అర్జున్ కురక్తస్రావం అవుతుందని బ్యాండేజ్ వేసాను. కానీ ఆయన మాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చెయ్యడంలో బిజీ అయ్యారు. కానీ నా వల్ల మీరు బాధపడటం నాకు ఇష్టం లేదని ఆయనకు చెప్పినట్లు రష్మిక చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక దీనిపై కూడా నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×