Game Changer : ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు రామ్ చరణ్ (Ram Charan). ఆ మూవీతో హిట్ అందుకున్న చెర్రీ చాలా గ్యాప్ తరువాత, ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీతో మరోసారి ఫ్యాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం బయటకు వచ్చింది.
రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందుతున్న భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. 25 జనవరి 10న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది ‘గేమ్ ఛేంజర్’. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రామ్ చరణ్ భారీ రెమ్యూనరేషన్ ను తన ఖాతాలో వేసుకున్నారని తెలుస్తోంది.
‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం చెర్రీకి ఏకంగా రూ.100 కోట్ల భారీ పారితోషికాన్ని నిర్మాతలు ముట్టజెప్పినట్టు టాక్ నడుస్తోంది. ఇది సినిమా మొత్తం బడ్జెట్లో 22 శాతం కావడం విశేషం. ఇక ఈ 100 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ ఇప్పటికే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న అగ్ర నటుల సరసన చేరారు. రజనీకాంత్, అల్లు అర్జున్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు సౌత్లో 150 కోట్లకు పైగా పారితోషికాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చెర్రీ కూడా ఈ లిస్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోబోతున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా 5-7 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కియారా గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) గనుక హిట్ అయితే ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ మారిపోవడం ఖాయం.
అలాగే నెక్స్ట్ మూవీకి చెర్రీ పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ – బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కంటే ఎక్కువే వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
‘ఆర్సీ 15’ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ గా రూ. 125 నుంచి రూ. 130 కోట్లు అందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా 50 కోట్లలోపే రెమ్యూనరేషన్ అందుకున్నట్టుగా టాక్ వచ్చింది. దానితో పోల్చి చూస్తే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)కి చెర్రీ డబుల్ రెమ్యూనరేషన్ ను తన ఖాతాలో వేసుకుంటున్నట్టే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక ఈ రెండు సినిమాలు గనక హిట్ టాక్ తెచ్చుకుంటే చెర్రీ పారితోషకం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.