BigTV English

Rashmika Mandanna:‘సౌందర్య’మే తన జీవిత లక్ష్యం అంటున్నరష్మిక మందన్న

Rashmika Mandanna:‘సౌందర్య’మే తన జీవిత లక్ష్యం అంటున్నరష్మిక మందన్న

Rashmika mandanna Dream role(Today tollywood news):


శ్రీవల్లి గా పుష్ప మూవీలో నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు ప్రస్తుతం బాలీవుడ్ లోనూ మార్మోగిపోతోంది. యానిమల్ మూవీ బంపర్ హిట్ తో రష్మిక లైఫ్ స్టయిలే మారిపోయింది. రాబోయే పుష్ప 2 కూడా హిట్ అయితే రష్మిక నెంబర్ వన్ హీరోయిన్ అయినట్లే. ఆ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ.

కన్నడ మూవీతో ఎంట్రీ


2016లో కన్నడ మూవీ కిర్రాక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. తెలుగులో మాత్రం రష్మిక చేసిన మొదటి సినిమా ఛలో. తెలుగులో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ హీరోయిన్ గా మారిపోయింది. 2017లో విడుదలైన ఛలో మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. నాగశౌర్య హీరోగా నటించాడు. వెంటనే గీత గోవిందం మూవీని చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. భీష్మ మూవీ కూడా రష్మిక కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2021లో విడుదలై రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప మూవీ రష్మికకు ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. ఆ మూవీలో డీ గ్లామర్ గా నటించి..శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నాలుగు కాలాల పాటు నిలిచుండే పాత్రను పోషించింది. ఇక బాలీవుడ్ లో గతేడాది రష్మిక నటించిన యానిమల్ మూవీ కూడా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

డ్రీమ్ రోల్

ఈ నేషనల్ క్రష్ కి ఓ తీరని కోరిక ఉందట. ఇప్పటిదాకా కమర్షియల్ మూవీలు చేస్తూ వచ్చిన రష్మిక తనకు సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉందని..అది తన డ్రీమ్ రూల్ అని చెబుతోంది. కన్నడ సినీ నేపథ్యం నుంచి టాలీవుడ్ కి వచ్చిన సౌందర్య అప్పట్లో దాదాపు అందరు అగ్రహీరోలతో నటించింది. లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర హీరోల సరసన నటించి అగ్రపథాన నిలిచింది. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలో విమాన ప్రమాదంలో ఆహుతి అయింది.

బయోపిక్ కథానాయికలు

కన్నడ నేపథ్యమే ఉన్న రష్మిక ఇప్పడు తమ ప్రాంతానికి చెందిన సౌందర్య బయోపిక్ లో నటించాలనే కోరిక బయటపెట్టింది. ఇప్పటికే విద్యాబాలన్ సిల్క్ స్మిత గా,కీర్తి సురేశ్ సావిత్రిగా, కంగనా రనౌత్ జయలలితగా బయోపిక్ పాత్రలలో నటించి మెప్పించారు. ఇక ప్రముఖ నటి తాప్సీ మిథాలీ రాజ్ గా నటిస్తోంది. ఎప్పటినుంచో దివ్యభారతి, సౌందర్య బయోపిక్ లు వస్తున్నాయంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుుతోంది. అదే జరిగితే సౌందర్య పాత్ర తనని ఎవరైనా సంప్రదిస్తే ఏ మాత్రం సంశయించకుండా తాను చేస్తానంటోంది. పైగా అది తన డ్రీమ్ రోల్ గా చెబుతోంది. మరి ఎవరైనా నిర్మాత రష్మిక డ్రీమ్ నెరవేరేలా మూవీ తీయడానికి ముందుకొస్తారేమో చూడాలి.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×