BigTV English

Mihir Shah Hit-and-Run Case| కారు ప్రమాదం తరువాత కొనఊపిరితో ఉన్న మహిళ హత్య.. డ్రైవర్ కూడా నిందితుడే!

Mihir Shah Hit-and-Run Case| కారు ప్రమాదం తరువాత కొనఊపిరితో ఉన్న మహిళ హత్య.. డ్రైవర్ కూడా నిందితుడే!

Mihir Shah Hit-and-Run Case(Telugu news live today): ముంబై BMW హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు అనేక సీసీటీవి వీడియోలను పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. శివసేన నాయకుడి 24 ఏళ్ల కుమారుడు మిహిర్ షా తన BMW కారును ఎదురుగా వెళుతున్న స్కూటీని వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. ఆ తరువాత స్కూటీ నడుపుతున్న మహిళ కారు బానెట్ పై పడింది. అయినా మద్యం మత్తులో ఉన్న నిందితుడు మిహిర్ షా ఆమెను కారుతో పాటు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.


Also Read: Alcohol Distributed at BJP MP’s Party: ఉచితంగా మద్యం పంపిణీ.. ఎక్కడంటే..?

ఈ క్రమంలో ఆమె కారు ఇంజిన్ బే, బంపర్ కింద నలిగిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తరువాత మిహిర్ షా కారులో పక్కనే కూర్చొని ఉన్న తన డ్రైవర్ కు కారు నడపమని చెప్పి.. కారు దిగిపోయాడు. కారు కింద పడి ఉన్న మహిళను రోడ్డు పక్కకు లాగాడు. డ్రైవర్ రాజ్‌రిషి బిదావత్‌ కొంత దూరం వెళ్లి కారుని రివర్స్ లో వచ్చి కొనఊపిరితో ఉన్న మహిళపై వేగంగా ఎక్కించాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యే అవుతుందని. ఇదంతా సీసీటీవి వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసులో నిందితులు ‘కల్పబుల్ హోమిసైడ్’ (ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య) నేరంగా పరిగణించామని పోలీసులు కోర్టుకు వివరించారు.


కారు ప్రమాదం తరువాత డ్రైవర్, మిహిర్ షా ఇద్దరూ కారుని బాంద్రా ప్రాంతంలో వదిలేసి మరోకారులో పారిపోయారు. ఆ తరువాత నిందితుడు మిహిర్ షా తన గర్లఫ్రెండ్ ఇంటికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కానీ ఆ తరువాత మిహిర్ షా అక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాడో తెలియలేదు.

ఈ కేసులో పోలీసులు.. నిందితుడి తండ్రి శివసేన నాయకుడు రాజేష్ షా, వారి డ్రైవర్ ను అరెస్టు చేశారు. కానీ కోర్టు రాజేష్ షాకు బెయిలుపై విడుదల చేసింది. ప్రమాదం జరిగిన BMW కారు రాజేష్ షా పేరుపైనే రిజిస్టర్ అయి ఉంది.

ప్రమాదం తరువాత మిహిర్ షా తన తండ్రికి ఫోన్ చేశాడని.. నిందితుడు పారిపోవడానికి అతని తండ్రి సహాయం చేశాడని పోలీసులు కోర్టు చెప్పారు. నిందితుడు ఎక్కడున్నాడో అతని తండ్రికి తెలుసునని పోలీసులు కోర్టులో రాజేష్ షా బెయిలుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఘటనా స్థలంలో రాజేష్ షా లేనందున అతనికి కోర్టు బెయిలు మంజూరు చేసింది.

Also Read: Rahul Gandhi Shankaracharya| రాహుల్ గాంధీకి శంకరాచార్య మద్దతు.. ‘హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు’

నిందితుడు మిహిర్ షా ప్రమాదానికి ముందు రాత్రంతా తన స్నేహితులతో కలిసి పబ్ లో మద్యం తాగి రూ.18750, బిల్లు చెల్లించాడని. పబ్ నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరగా.. ప్రమాదం సుమారు 5.30 గంటల సమయంలో జరిగింది.

పోలీసులు ప్రస్తుతం నిందితుడు మిహిర్ షా గర్ల్ ఫ్రెండ్ ను విచారణ చేస్తున్నారు. ఇటీవలే ఇలాంటిదే పుణే పోర్చ్ ప్రమాదం కేసులో నిందితుడు ఇలాగే మద్యం సేవించి బైక్ పై వెళుతున్న ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. ఆ తరువాత అతడిని కాపాడేందుకు అతడి కుటుంబసభ్యులు, పోలీసులు, డాక్టర్లు విచారణను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లు బయటపడింది.

ముంబైలో ఇటీవల ఇలాంటి కేసులు పెరిగిపోతుండగా.. మిహిర్ షా కేసులో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నిందితుడిని క్షమించేది లేదని.. అతనికి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు.

 

 

Tags

Related News

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Big Stories

×