Rajamouli : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎస్.ఎస్ రాజమౌళి ఎంతటి గుర్తింపు ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమాకి ఒక మార్కెట్ ఓపెన్ అయ్యేలా చేసిన ఘనత ఎస్ ఎస్ రాజమౌళికి ఉంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాకి ఎంత సత్తా ఉంది అని ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేసింది. చాలామంది ఎస్ఎస్ రాజమౌళి టాలెంట్ చూసి ఆశ్చర్యపోయారు. ఇక సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ కూడా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ పోస్టర్స్ వేయడం మొదలుపెట్టారు. ఇక పుష్ప 2 సినిమా బాహుబలి రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తుందని చాలామంది ఊహిస్తున్నారు.
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈవెంట్ లో రాజమౌళి ఏం మాట్లాడుతాడు అని క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. కానీ రాజమౌళి స్పీచ్ మాత్రం చాలా మందిని నిరాశపరిచింది. మామూలుగా అల్లు అర్జున్ సినిమా అంటే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యేవారు. కానీ రీసెంట్ టైమ్స్ లో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వారు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాల అభిమానులు కూడా ఒకరిపై ఒకరు ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ నుంచి గెస్ట్ రావట్లేదు కాబట్టి రాజమౌళిని నామమాత్రంగా పిలిచి ఉంటారు అని చాలామంది ఊహిస్తున్నారు. పిలిచారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అని రాజమౌళి హడావిడిగా మాట్లాడి వెళ్ళిపోయాడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ.. పుష్ప సినిమా టైంలో బన్నీకి చెప్పాను నార్త్ ఆడియన్స్ ని వదలొద్దు అని. అయితే ఇప్పుడు చూస్తుంటే అందరూ సినిమాకి టికెట్టు బుక్ చేసుకునే ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలనుకోవడం లేదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన ఒక సీన్ ను రామోజీ ఫిలిం సిటీలో దర్శకుడు సుకుమార్ నాకు చూపించారు. ఇది చూసినప్పుడు నాకు చాలా హై వచ్చింది దేవి శ్రీ ప్రసాద్ దేనికి ఏ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తాడా అని ఆలోచించాను. అసలు పుష్ప రాజ్ సత్తా ఏంటో డిసెంబర్ 4వ తారీఖు రాత్రి ఈ ప్రపంచానికి తెలియనుంది అంటూ తనదైన శైలిలో ఎలివేషన్ ఇచ్చాడు ఎస్.ఎస్ రాజమౌళి. ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఈ సినిమా ఖచ్చితంగా కిట్ అవుతుంది అంటూ తెలిపాడు రాజమౌళి.
Also Read : Allu Ayaan in Pushpa Pre-release event : మళ్లీ మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చాడు