BigTV English

Earthquake in Sea : అమ్మో.. వారంలో 6 వేల భూకంపాలు – వణికిపోతున్న ఆ దేశ ప్రజలు

Earthquake in Sea : అమ్మో.. వారంలో 6 వేల భూకంపాలు – వణికిపోతున్న ఆ దేశ ప్రజలు

Earthquake in Sea : ఒకటి, రెండు భూకంపాలు వస్తేనే మనం కంపించిపోతుంటాం. ఏం జరుగుతుందో తెలియక కంగారు పడిపోతుంటాం. కానీ.. ఆదేశంలో మాత్రం కాళ్ల కింద భూమి కంపిస్తూనే ఉంది. ప్రకృతి ఏమైనా పగపట్టిందా అన్నట్లు కాసేపైనా విరామం ఇవ్వకుండా.. ఏకంగా వారంలో 6 వేల సార్లు అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. తెలుసుకుంటుంటేనే భయంగా ఉంది కదా.. కానీ, ద్వీపకల్ప దేశమైన గ్రీన్ ల్యాండ్ ప్రజలు ఈ వరుస భూకంపాలతో వణికిస్తోంది. చుట్టూ సముద్రంతో మధ్యలో తేలియాడేలా ఉండే ఈ దేశం ఇప్పుడు.. భూకంపాలు, దాని ద్వారా వచ్చే ఇతర ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే పనిలో నిమగ్నమైంది. పూర్తి దేశం అప్రమత్తంగా భూకంపాల నుంచి బయటపడేందుకు, ప్రజల, ఇతర ప్రాణుల రక్షణ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు.. అసలు ఒకే ప్రాంతంలో ఏకంగా 6 వేల సార్లు భూమి ఎలా కంపిస్తోందనే అనుమానాలతో భూగర్భ శాస్త్రవేత్తలు పరిశీలనలు జరుపుతున్నారు. అక్కడ జరుగుతున్న భూగర్భ మార్పు చేర్పులపై అధ్యయనం చేస్తున్నారు.


గ్రీన్ ల్యాండ్ కు చెందిన సాంటోరిని అనే ఓ ఐల్యాండ్ లో గత వారం రోజులుగా వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. జనవరి 31న మొదలైన ప్రకంపనలు.. రోజూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడి భూకంప కేంద్రాలు నమోదు చేసిన దాన్ని బట్టి.. 5.2 అత్యంత గరిష్టమైన భూకంపంగా అధికారులు తెలుపుతున్నారు. మిగతావన్ని స్పల్ప, మధ్య స్థాయిలోనే ప్రకంపనలు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. కాగా.. సాంటోరిని ద్వీపంలో పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

భూకంప కేంద్రం సాంటోరిని, అనాఫి, అమర్గోస్, ఐఓస్.. ఐల్యాండ్స్ మధ్య కేంద్రీకృతమై ఉన్నట్లు గుర్తించారు. నిత్యం భూకంప కేంద్రాల్లో అలర్టులు వస్తుండగా.. భూకంపాల ప్రభావంతో ఆ ప్రాంతంలోని సముద్రం తీవ్ర ఉద్రిక్తతగా ఉన్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం ద్వీపంలో అన్ని కార్యక్రమాలు స్థంభించిపోగా, ప్రజల్ని అక్కడి నుంచి గ్రీన్ ల్యాండ్ ప్రధాన భూభాగంపైకి ఫెర్రీలను వినియోగించి తరలిస్తున్నారు. పూర్తి సాంటోరిని ద్వీపంలో స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించిన గ్రీస్ ప్రభుత్వం.. అక్కడ అగ్నిమాపక, పోలీసు, కోస్ట్ గార్డు, విపత్తుల నిర్వహణ బృందాలతో పాటుగా ఆర్మీ దళాలను, ఎమర్జెన్సీ మెడికల్ విభాగంలోని సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో అదనపు బృందాలను మోహరించింది. ఈ విపత్తును అధిగమించేందుకు, పరిస్థితులు స్థిమితపడే వరకు అక్కడ ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతాయని గ్రీస్ ప్రభుత్వం వెల్లడించింది.


నిపుణులు ఏం అంటున్నారు
ఈ ప్రాంతంలోని సముద్ర గర్భంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అగ్నిపర్వతాలు యాక్టీవ్ స్థితిలో ఉన్నట్లు పరిశోధకులు తెలుపుతున్నారు. ఏజియాన్ సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాల చర్యల కారణంగానే ఈ వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టంగా చెప్పలేమంటున్నారు. అయితే.. ఇవి ఈ ప్రాంతంలో మరింత శక్తివంతమైన భూకంపాలకు దారి తీస్తాయా.? లేదా.? అన్న విషయాన్ని అంచనా వేయడం కష్టమంటున్నారు. ఏథెన్స్‌లోని నేషనల్ అబ్జర్వేటరీలో భూకంప శాస్త్రవేత్త, పరిశోధన డైరెక్టర్ ఒకరు మాట్లాడుతూ.. ఈ భూకంపాలు నెమ్మదిగా ఆగిపోతాయనేందుకు కానీ, కొనసాగుతాయా అనేది స్పష్టంమైన సమాచారం అందలేదంటున్నారు.

Also Read : ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే 20 ఏళ్లు జైలుకే – నూతన చట్టం వచ్చేస్తోంది

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×