VD 12 Title Update: ఈరోజుల్లో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈజీగా దాని గురించి బయటికి వచ్చేస్తుంది. క్యాస్టింగ్ అయినా, టైటిల్ అయినా.. ఇలా ఏదైనా కూడా ఇండస్ట్రీలో రహస్యంగా దాగడం కష్టం. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన టైటిల్ ఇదేనంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిని ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా దీనికి సంబంధించిన అప్డేట్ అధికారికంగా ప్రకటించే టైమ్ వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ.
ఇన్నాళ్లకు అప్డేట్
గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేస్తున్నాడు అనగానే యూత్‌లో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమాలు అలాంటివి. కానీ వీరి మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి పలుమార్లు సెట్ నుండి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వడం తప్పా వీరు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ‘వీడీ 12’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి కేవలం ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదలయ్యింది. అయినా ఇప్పటివరకు ఫ్యాన్స్ ఓపికగా ఎదురుచూస్తూ ఉండడంతో వారికోసం ఒక స్పెషల్ అప్డేట్‌తో ముందుకొచ్చాడు విజయ్.
కిరీటం కోసం రాజు
‘మీరంతా చాలా ఓపికగా ఉన్నారు. మీ అందరి ప్రేమను మేము ఫీల్ అయ్యాం. ఇప్పుడు మేము మా ప్రపంచాన్ని, మా కథను, మా మనసులను మీకోసం తెరవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గర్వించదగ్గ టైటిల్, టీజర్‌తో వీడీ 12’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. అంతే కాకుండా దాంతో పాటు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. అందులో రాజు కోసం కిరీటం ఎదురుచూస్తోంది అని, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ ఫిబ్రవరి 12న విడుదల కానుందని ప్రకటించాడు. ఈ పోస్టర్‌లో కిరీటం తప్పా ఇంకేమీ లేదు. అయితే ఇప్పటికే ఈ మూవీకి ‘సామ్రాజ్యం’ అనే అచ్చ తెలుగు టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ‘తండేల్’లో ఆ అంశాన్ని వాడుకోలేకపోయిన దర్శకుడు.. అంచనాలు తారుమారు..
కమర్షియల్ సినిమా
ఇప్పటివరకు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. యూత్ కోసం చేసిన సినిమాలు అన్నీ చాలావరకు హిట్ అయ్యాయి. కానీ తను నటించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. అయినా కూడా ‘వీడీ 12’ నుండి ఇప్పటివరకు లీక్ అయిన ఫోటోలు, దాంతో పాటు విజయ్ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదొక కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే అనిపిస్తోంది. మరి ఈ సినిమాతో మొదటిసారి తన ఖాతాలో కమర్షియల్ ఎంటర్‌టైనర్ సక్సెస్‌ను విజయ్ వేసుకోగలడేమో చూడాలి. చాలావరకు ప్రేక్షకులు గౌతమ్ తిన్ననూరి సినిమా కాబట్టి ఇది ఎలాగైనా అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ సినిమాకు ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారా లేదా తెలియాలంటే ఫిబ్రవరి 12 వరకు ఆగాల్సిందే.
You have all been patient.
We have felt your tough love.We are now ready to open our world, our story and all our hearts to you.
With a Title and Teaser you will be proud of! #VD12 pic.twitter.com/aGkBee1o6S
— Vijay Deverakonda (@TheDeverakonda) February 7, 2025