BigTV English

Rashmika Mandanna : రష్మికా… ఇప్పుడు ఈ ప్రయోగాలు అవసరమా..?

Rashmika Mandanna : రష్మికా… ఇప్పుడు ఈ ప్రయోగాలు అవసరమా..?

Rashmika Mandanna : రష్మిక మందన్నా… ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో రష్మిక ఎవరికీ అందలేని ఎత్తుకు వెళ్లిపోయింది. యానిమల్ మూవీ – 920 కోట్లు. పుష్ప 2 మూవీ 1871 కోట్లు. తాజాగా ఛావా మూవీ ఇప్పటికే 450 కోట్లు కలెక్ట్ చేసింది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ 500 కోట్ల మార్కు అందుకోవచ్చు. పైగా ఈ మూవీ ఈ నెల 7న తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కాబోతుంది.


మొత్తంగా అయితే… రష్మికా మందన్నా కెరీర్ సూపర్ సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే ఈ టైంలో రష్మిక ఓ ప్రయోగం చేయబోతుందట. సూపర్ సక్సస్ ఫుల్ కెరీర్ కాబట్టి… ఆ ప్రయోగం చేయడానికి డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇలాంటి రష్మిక ప్రయోగాలు చేయడం ఎలాంటి ఫలితం వస్తుందో… అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

ఇంతకీ ఆ ప్రయోగం ఏంటంటే..?
వరుస హిట్స్ తర్వాత రష్మిక పాపులారిటీ బాలీవుడ్‌లో విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని అర్థం చేసుకున్న ఓ బాలీవుడ్ నిర్మాత… ముందుకు వచ్చాడట. రష్మికపై 100 కోట్లు పెట్టి… ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలని ప్లాన్ చేశాడట. రష్మికను ఇదే విషయం గురించి సంప్రదిస్తే… వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.


దీంతో ఓ టాప్ డైరెక్టర్‌ను పట్టుకుని ప్రస్తుతం కథ పరమైన చర్చలు జరుపుతున్నారట. అన్నీ కుదిరితే.. ఈ ఏడాది చివరలో ఆ 100 కోట్ల లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

అయితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్మిక టాప్ హీరోయినే. అందులో ఎలాంటి డౌట్ లేదు. హీరోల వల్లో… డైరెక్టర్ల వల్లో… రష్మికకు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే వచ్చాయి. ఫ్రీగా ఫుల్ పాపులారిటీ కూడా వచ్చేసింది.

కానీ, సోలోగా 100 కోట్ల బడ్జెట్‌తో మూవీ చేసే పరిస్థితి రష్మిక దగ్గర లేదనే చెప్పొచ్చు. ప్రయోగాలు చేయడం తప్పు లేదు. ఒక వేళ ఆ ప్రయోగం సక్సెస్ అయితే… లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుని మరింత పాపులర్ అవుతుంది. అలాగే, లేడీ ఓరియంటెడ్ మూవీస్ కెరాఫ్ అవుతుంది. అయితే… సమస్య అంతా.. ఆ బడ్జెట్ గురించే.

ఇప్పుడున్న పరిస్థితులతో 100 కోట్ల మూవీ చేస్తే… అది గానీ విఫలం అయితే, బెడిసి కొడితే… ఈ మూడు సినిమాలతో వచ్చిన క్రేజ్, పాపులారిటీ ఈ ఒక్క మూవీతోనే పోయే అవకాశం ఉంది. అంతే కాదు… కెరీర్ మొత్తం టర్న్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే రష్మిక అభిమానులు ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తే… కొంచెం తక్కువ బడ్జెట్‌తో చేస్తే.. అది ఫెయిల్ అయినా.. పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ, ఇలాంటి భారీ బడ్జెట్‌తో చేయడం అనేది చాలా రిస్క్ అని చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం రష్మిక లైనప్ భారీగానే ఉంది. ముందుగా చెప్పాలంటే… సల్మాన్ ఖాన్ – మురుగదాస్ మూవీ అయిన సికిందర్. ఇది దాదాపు 400 కోట్ల బడ్జెట్. ఈ నెల 28న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది 1000 కోట్ల మార్క్ దాటడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక సల్మాన్ అభిమానులు అయితే… 2000 కోట్ల మూవీ అని కూడా అంటున్నారు. దీని తర్వాత కుబేర మూవీ ఉంది. ఇది దాదాపు 120 కోట్ల బడ్జెట్ మూవీ. ఇది కూడా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

ఇలా భారీ లైనప్‌తో ఉన్న రష్మిక.. ఈ 100 కోట్ల ప్రయోగం చేయడానికి ముందు కాస్త ఆలోచించాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ గురించి ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన రాలేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×