BigTV English

CM Revanth Reddy: ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఎందుకంటే..

CM Revanth Reddy: ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఎందుకంటే..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ వస్తున్న సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన  నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కీలకంగా మారాయి.


బీసీ రిజర్వేషన్ల బిల్లును త్వరలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. ఆమోద ముద్ర వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ నెల 10న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలిపేలా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఇతర పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలవనున్నారు.

ఈ తరుణంలో కులగణన సర్వే గురించి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కులగణన బిల్లు ఆమోదం పొందేలా కృషి చేయనున్నారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరే అవకాశం ఉంది.


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పర్యటనలో ప్రధాని మోడీతో చర్చించిన అంశాలపై.. మరొకసారి కేంద్ర మంత్రి ఖట్టర్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: ప్రపంచంలో అతిపెద్ద టన్నెల్ ఇది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు ఫేస్ – 2, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులపై చర్చించి నిధుల విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం … కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్- 2 కి అనుమతించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. . గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధాని దృష్టికి తీస్కెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2 కింద రూ. 24 వేల 269 కోట్ల అంచనా వ్యయంతో 76. 4 కి. మీ పొడవైన ఐదు కారిడార్లను ప్రతిపాదించామని ప్రధానికి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతించాలని అభ్యర్ధించారు. ప్రధాని అధికారిక నివాసంలో బుధవారం ఉదయం భేటీ అయిన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీస్కెళ్లారు.

సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ప్రధానమంత్రిని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఐటీ శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, ఇతర ఉన్నతాధికారులు సైతం ఉన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×