Sampoornesh Babu..బర్నింగ్ స్టార్.. సంపూర్ణేష్ బాబు(Sampoornesh babu)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నరసింహాచారి అయిన ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి సంపూర్ణేష్ బాబుగా తన పేరును మార్చుకున్నారు. ‘హృదయ కాలేయం’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంపూర్ణేష్ బాబు.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే హృదయ కాలేయం సినిమా విడుదల కాకముందే కొబ్బరి మట్ట సినిమా కూడా ప్రారంభించి,యంగ్ హీరోలకి కూడా అప్పట్లో గట్టి పోటీ ఇచ్చారు. ఇంకా తర్వాత బందిపోటు, జ్యోతిలక్ష్మి, పెసరట్టు, వినోదం 100%, దేవదాస్, బజార్ రౌడీ, హాఫ్ స్టోరీస్ , మార్టిన్ లూథర్ కింగ్ వంటి పలు చిత్రాలలో నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు మళ్లీ సోదర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఏప్రిల్ 11న సోదర మూవీతో రానున్న సంపూర్ణేష్ బాబు..
సంపూర్ణేష్ బాబు , సంజోష్, ఆరతి గుప్తా, ప్రాచీ బంసాల్ హీరో , హీరోయిన్లుగా అన్నదమ్ముల మధ్య అనుబంధం నేపథ్యంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘సోదరా’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చంద్రచగంలా నిర్మాణంలో మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇక ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఒక పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పెళ్లికొడుకు , పెళ్ళికూతురు గెటప్లో ఒక తాడు పట్టుకొని లాగుతున్నట్టు మనకి చూపించారు. మొత్తానికైతే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు గట్టి కం బ్యాక్ ఇవ్వాలి అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
సినిమాపై హైప్ పెంచిన డైరెక్టర్..
ఇకపోతే రిలీజ్ డేట్ ను అనౌన్ చేసిన నేపథ్యంలో డైరెక్టర్ మోహన్ మేనంపల్లి మాట్లాడుతూ.. అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్న సినిమానే మా ఈ సోదర. తెలుగు పరిశ్రమలో ఎంతోమంది సోదరులు వున్నారు. అలాంటి సోదరులందరి బంధాన్ని అద్దం పట్టేలా ఈ సోదరా సినిమా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది అంటూ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ.. “సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆయనలోని మరో కోణాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారు” అంటూ తెలిపారు. మొత్తానికి అయితే ఎటువంటి అంచనాల లేకుండా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇదిలా ఉండగా మరొకవైపు హీరో కన్ఫ్యూజన్లో పడినట్లు సమాచారం . ఇప్పటివరకు కామెడీ జానర్ లో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సంపూర్ణేష్ బాబు.. మరో కోణం చూపించడానికి సిద్ధం అయ్యారు అని డైరెక్టర్ చెప్పడంతో. ఈ పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారా?.. ఒకవేళ ఆదరిస్తే ఆ కొత్త పాత్రలోనే సినిమాలు చేయాలా? లేక కామెడీ తరహాలోనే ప్రేక్షకులను అలరించాలా అనే కన్ఫ్యూజన్లో పడినట్లు సమాచారం
ALSO READ; Sara AliKhan : హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన అవార్డు… బాలీవుడ్‌లో ఇదో సంచలనం..!
సంపూర్ణేష్ బాబు వ్యక్తిగత జీవితం..
ఇక సంపూర్ణేష్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈయన సొంత ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. పేద విశ్వకర్మ కుటుంబం నుండి వచ్చారు. తినడానికి కూడా తిండి ఉండేది కాదట. ఇతనికి ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు. అయితే సంపూర్ణేష్ బాబు ఏడవ తరగతి చదువుకునేటప్పుడే తండ్రి మరణించాడు. ఇక చిన్నప్పుడే కుటుంబాన్ని పోషించడానికి అన్నతో కలిసి పని ప్రారంభించినయన ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనే కోరికతో నటనలో శిక్షణ తీసుకొని మరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.