BigTV English

Raveena Tandon: ఆ సమయంలో భయపడ్డా, అందుకే ఇవ్వలేదన్న రవీనాటాండన్

Raveena Tandon: ఆ సమయంలో భయపడ్డా, అందుకే ఇవ్వలేదన్న రవీనాటాండన్

Raveena Tandon: బాలీవుడ్ నటి రవీనాటాండన్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. హిందీతోపాటు తెలుగు సినిమాల్లోనూ నటించింది. బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’ సినిమాలో నటించింది. సరిగ్గా 30 ఏళ్ల కిందట ఆమె నటించిన మూవీ మొహ్రా. అందులో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ ‘తు చీజ్ బడి హై మస్తు మస్తు‘ బాలీవుడ్ బాక్సాఫీసుని ఓ కుదిపు కుదిపేసింది.


ఆ సాంగ్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ అనుకోండి. రవీనాకు మాంచి ఇమేజ్ తెచ్చిన చిత్రం అదేననుకోండి. దశాబ్దంపాటు గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె, మళ్లీ యాక్టివ్ అవుతోంది. రెండేళ్ల కిందట వచ్చిన కేజీఎఫ్ 2 ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చేసింది.

పాన్ ఇండియా మూవీ కావడంతో రవీనాకు పవర్‌ఫుల్ రోల్ దక్కింది. తాజాగా ఆమె తన హార్డ్‌కోర్ అభిమానికి సారీ చెప్పింది. నార్మల్‌గా నటీనటులంటే అభిమానులకు పిచ్చి. వారిని చూడగానే ఒకప్పుడు ఆటోగ్రాఫ్.. ప్రస్తుతం సెల్ఫీ దిగేందుకు తహతహలాడుతారు. తన వద్దకు సెల్ఫీ కోసం వచ్చారు అభిమానులు. భయపడిన ఆమె, సెల్ఫీకి ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. చివరకు ఈ వ్యవహారం గురించి తెలియగానే ఆ అభిమానులకు క్షమాపణలు చెప్పింది.


ఇంతకీ ఎప్పుడు, ఎక్కడ? కొద్దిరోజుల కిందట లండన్ వెళ్లింది నటి రవీనాటాండన్. లండన్ వీధుల్లో ఒంటరి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెని కొందరు గుర్తుపట్టారు. కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చిన సెల్ఫీ అడిగారు. వారికి ఎలాంటి జవాబు ఇవ్వకుండా సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యిందామె.

ALSO READ: విజయ్ దళపతి ఆఖరి సినిమాలో బుట్టబొమ్మ కు ఛాన్స్?

కొన్నాళ్లుగా సిటీలో జరుగుతున్న ఘటనలు చూసి షాకవుతున్నానని, ఒక్కోసారి భయమేస్తున్నట్లు తెలిపింది రవీనాటాండన్. తన దగ్గరకు కొందరు వ్యక్తులు వచ్చినప్పుడు భయమేసిందని మనసులోని మాట బయటపెట్టింది. ఆ సమయంలో తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది. అందుకే వేగంగా వెళ్లినట్టు వెల్లడించింది. ఈ విషయంలో అభిమానులు ఏమీ అనుకోవద్దని చెప్పుకొచ్చింది.

ముంబైలోని బాంద్రాలో ఎదురైన ఘటన నుంచి తానింకా కోలుకోలేదని తెలియజేసింది. వారితో సెల్ఫీ దిగాలని మనసుకు అనిపించినప్పటికీ, దైర్యం చేయలేకపోయానని రాసుకొచ్చింది. అలా ప్రవర్తించినందుకు చాలా బాధగా ఉందని, తనను క్షమించాలంటూ రాసుకొచ్చింది.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×