BigTV English

Pooja Hegde: విజయ్ దళపతి ఆఖరి సినిమాలో బుట్టబొమ్మ కు ఛాన్స్?

Pooja Hegde: విజయ్ దళపతి ఆఖరి సినిమాలో బుట్టబొమ్మ కు ఛాన్స్?

Pooja Hegde acting Vijay thalapathy last movie in tamil: బుట్ట బొమ్మా బుట్టబొమ్మా నన్ను చుట్టూకుంటివే..అంటూ అల్లు అర్జున్ పూజాహెగ్దేపై పాడిన రొమాంటిక్ పాటను అలా ఎలా మర్చిపోగలరు జనం. ఇప్పటికీ మెలోడీ పాటగా జనం నోళ్లలో ఇంకా నానుతూనే ఉంది. అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్ తర్వాత పూజా కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది. గుంటూరు కారంలో మహేష్ సరసన నటిస్తోందని ప్రచారం చేసి తీరా చివరి మూమెంట్ లో శ్రీలీలకు ఆ అవకాశం దక్కింది. ఎంతో ఆశగా బాలీవుడ్ వైపు వెళ్లిన పూజాకు అక్కడ కూడా సరైన ఛాన్స్ దక్కలేదు. పూజా అవకాశాలను శ్రీలీల తెలుగులో చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఏ సినిమాలూ లేక ఖాళీగా ఉంటోంది.


విజయ్ మూవీపైనే ఆశలన్నీ

అందం, అభినయం అన్నీ బాగానే ఉన్నా ఎందుకో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విజయ్ దళపతి నటించే చివరి చిత్రంలో ఆఫర్ దక్కించుకుందట. వాస్తవానికి విజయ్ దళపతి చివరి చిత్రంగా గోట్ అనుకున్నప్పటికీ ఆల్రెడీ కమిట్ అవడంతో తప్పనిసరి పరిస్థితిలో మరో సినిమా చేయవలసి వచ్చింది. ఈ మూవీని విజయ్ తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. కేవలం నలభై రోజుల్లో తన పార్ట్ పూర్తి చేయాలని నిర్మాతకు ఆదేశించారు విజయ్. అయితే ఈ మూవీలో ఇప్పటికే సిమ్రాన్ కూడా నటిస్తోందని సమాచారం. ఇప్పుడు పూజా హెగ్దేని కూడా తీసుకోవడం దాదాపు ఖాయమైపోయింది. అంటే ఇందులో కూడా విజయ్ రెండు గెటప్పులలో కనిపించనున్నాడన్నమాట. అయితే పూజా హెగ్దేకి ఈ మూవీ హిట్ అత్యవసరం. ఈ సినిమా తర్వాత మళ్లీ అవకాశాలు వస్తాయని అనుకుంటోంది ఈ బ్యూటీ.
అప్పట్లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా టాప్ యంగ్ హీరోలందరితోనూ నటించింది.


త్వరలోనే పెళ్లి

పూజా హెగ్దే కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. బాయ్ ఫ్రెండ్ గా ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. అతని పేరు రోహన్ మెహ్రా. బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్స్ లో నటించాడు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి షాపింగులు, నైట్ పార్టీలు ఇలా ఇద్దరూ కలిసి చాలా సార్లు మీడియాకు దొరికిపోయారు. పూజా హెగ్దే పేరెంట్స్ కూడా వీళ్ల ప్రేమకు ఓకే చెప్పారని సమాచారం. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇద్దరూ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం పూజా కెరీర్ కూడా అంతంత మాత్రంగానే నడుస్తోంది. అందుకే పెళ్లి ప్రయత్నాలు కూడా చేసుకుంటోందని అనుకుంటున్నారంతా. సినిమాలు ఏవీ లేకపోయినా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది పూజా హెగ్దే. తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు కిక్ ఎక్కించే హాట్ భంగిమల ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది పూజా. మిస్ ఇండియా పోటీలలో సెకండ్ రన్నరప్ గా నిలిచింది పూజా.

హిట్ పెయిర్

మొదట్లో కమర్షియల్ యాడ్స్ చేసి ఆకట్టుకుంది. 2012లో ఓ తమిళ చిత్రంతో సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. ముగముడి అనే తమిళ చిత్రం. రంగం హీరో జీవా ఈ సినిమాలో హీరో. అతని పక్కన హీరోయిన్ గా తొలి అవకాశం దక్కించుకుంది పూజా. ముగముడి తెలుగులో మాస్క్ గా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మాత్రం నాగచైతన్య సరసన 2014లో రిలీజైన ఒక లైలా కోసం మూవీలో నటించింది. తెలుగులో అల్లు అర్జున్ పక్కన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురం చిత్రాల హిట్స్ తో వీరిద్దరూ హిట్ పెయిర్ అనిపించారు. ఏది ఏమైనా ఈ బ్యూటీకి మళ్లీ ట్రాక్ లోకి రావాలంటే ఓ సూపర్ హిట్ రేంజ్ మూవీ రావాల్సిందే.

 

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×