BigTV English

Tiger Nageswara Rao : ట్రైలర్ తో ఊచ కోత మొదలుపెట్టిన మాస్ మహారాజ్…

Tiger Nageswara Rao : ట్రైలర్ తో ఊచ కోత మొదలుపెట్టిన మాస్ మహారాజ్…
Tiger Nageswara Rao


Tiger Nageswara Rao : రవితేజ కి మాస్ ప్రేక్షకుల లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త జోరు తగ్గిన ఈ హీరో వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్న సమయంలో స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు స్టోరీ అతనికి బాగా సెట్ అయింది. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ మాస్ మహారాజ్ ఖాతాలో ఊర మాస్ హిట్ పడబోతోంది అని చెప్పకనే చెప్పింది.

ఈ ట్రైలర్ చూసిన అభిమానులు మాస్ మహారాజ్ ఇస్ బ్యాక్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. మొత్తానికి ఒక్క ట్రైలర్ తోటే రవితేజ ఊచకోత మొదలుపెట్టాడు. ఒక ట్రైలర్ ఇలా ఉంది అంటే.. ఇక మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. స్టువర్టుపురం పేరు తెలియని వారు ఉండరు. గతంలో స్టువర్టుపురం నేపథ్యంతో చాలా సినిమాలు వచ్చాయి. దొంగలకు అడ్డాగా స్టువర్టుపురం ఒకానొక సమయంలో ఆంధ్ర రాష్ట్రనే వణికించింది. అలాంటి స్టువర్టుపురంలో ..దేశంలోని అతిపెద్ద గజదొంగగా గుర్తింపు తెచ్చుకున్న స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ఇది.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్ లు మూవీ పై మరింత ఆసక్తిని నెలకొల్పాయి. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ మాస్ మహారాజ్ అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. అక్టోబర్ 20న ఈ చిత్రం తెలుగుతో పాటుగా హిందీ ,తమిళ్ ,కన్నడ ,మలయాళం భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందుకే ట్రైలర్ ని కూడా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయడం జరిగింది. ఇందులో రవితేజ గెటప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం ఎంతో ఎక్స్ట్రార్డినరీగా కనిపిస్తుంది.

ఈ మూవీలో నుపుర్ సనన్ హీరోయిన్‍గా నటిస్తుండగా… గాయత్రీ భరద్వాజ్, రేణు దేశాయ్,అనుపమ్ ఖేర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టువర్టుపురంలో దొంగతనాలు చేసేటటువంటి ప్రదేశాలకు జరిగే వేలంపాటతో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. కరుడుగట్టిన అతి పెద్ద గజదొంగగా రవితేజ ఈ ట్రైలర్లో అదరగొట్టాడు. మరి ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లు ,దానికి తగ్గట్టు రవితేజ డైలాగులు వ్యూవర్స్ కి మంచి ట్రీట్. ఈ ట్రైలర్లో టైగర్ నాగేశ్వరరావు మనస్తత్వంతో పాటు ,అతనికి డబ్బు బంగారంపై ఎంత వ్యామోహం ఉందో బాగా చూపించారు.

అయితే ఒకానొక సందర్భంలో టైగర్ నాగేశ్వరరావు జైలుకు వెళ్లడంతో ..ఇక స్టువర్టుపురంలో అతని స్టోరీ పూర్తయిపోయింది అని అందరూ అనుకుంటారు…కానీ టైగర్ నాగేశ్వరరావు రియల్ స్టోరీ అక్కడే మొదలైంది ….అని మురళీ శర్మ చెప్పే డైలాగ్ మాత్రం గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సెకండ్ వైఫ్ రేణు దేశాయ్.. ఒక పవర్ఫుల్ సంఘసంస్కర్త పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటించిన అనుపమ్ ఖేర్.. టైగర్ నాగేశ్వరరావు గురించి పీఎం పర్సనల్ సెక్యూరిటీతో చెప్పే డైలాగ్స్ ట్రైలర్ చివరలో ఉన్నాయి. ఫైనల్ గా పంజాబీ గెటప్ లో టైగర్ నాగేశ్వరరావు కనిపించడంతో ట్రైలర్ ఫినిష్ అవుతుంది. మొత్తానికి మంచి పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో పాటు , యాక్షన్ సీక్వెన్స్ తో మూవీ సాలిడ్ ఎంటర్టైనర్ గా ఉంటుంది అని ట్రైలర్ లో బాగా హింట్ ఇచ్చారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×