BigTV English

Sikkim Flash Floods : సిక్కింలో ఆకస్మిక వరదలు..23 మంది జవాన్లు గల్లంతు

Sikkim Flash Floods : సిక్కింలో ఆకస్మిక వరదలు..23 మంది జవాన్లు గల్లంతు
Sikkim Flash Floods

Sikkim flood news(Breaking news of today in India):

ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆకస్మిక వరదలు (Sikkim Flash Floods) సంభవించాయి. గత రాత్రి లోనాక్ సరస్సు వద్ద కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తానది ఉప్పొంగడంతో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వరదల్లో 23 మంది జవాన్లు గల్లంతయ్యారని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కుండపోత వర్షాల కారణంగా తీస్తానదికి వరద పోటెత్తింది. నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడం, అదే సమయంలో డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో అక్కడి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దిగువ ప్రాంతంలో నీటిమట్టం 15-20 అడుగుల మేర పెరగడంతో.. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో మెరుపు వరదలు సంభవించాయి.


వరదల తీవ్రతకు లాచెన్ లోయలోని ఆర్మీపోస్టులు నీట మునగగా.. సింగ్తమ్ లో ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ వాహనాలలో ఉన్న 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. 41 వాహనాలు నీటమునిగినట్లు తెలిపింది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేకపోవడంతో అక్కడి ఆర్మీ సిబ్బందిని కమాండ్ స్థాయి అధికారులు సంప్రదించడం కష్టమైనట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

కుండపోత వర్షాలతో తీస్తానది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్ ఫూట్ బ్రిడ్జ్ కుప్పకూలింది. మరోవైపు పశ్చిమబెంగాల్, సిక్కింను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి చాలా చోట్ల కొట్టుకుపోయింది. ఆకస్మిక వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిపై స్పందించిన సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్.. సిక్కింలో వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి.. సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. తీస్తానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.


https://x.com/SM_8009/status/1709417978264199676?s=20

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×