BigTV English

Ravi Teja: మళ్లీ ‘చూపులతో గుచ్చి గుచ్చి’ సాంగ్ వచ్చేస్తోంది.. ఇక రవితేజ ఫ్యాన్స్‌కు మాస్ జాతరే..

Ravi Teja: మళ్లీ ‘చూపులతో గుచ్చి గుచ్చి’ సాంగ్ వచ్చేస్తోంది.. ఇక రవితేజ ఫ్యాన్స్‌కు మాస్ జాతరే..

Ravi Teja: హీరోలు కాస్త స్టార్లుగా ఇమేజ్ సంపాదించుకోగానే తమ పాత సినిమాల టైటిల్స్‌ను, పాత పాటలను రీమేక్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కసారి హీరోలు.. పక్క హీరోల పాటలను కూడా రీమిక్స్ చేస్తుంటారు. కానీ చాలావరకు తమ పాటలను తాము రీమిక్స్ చేయడానికే ఇష్టపడుతుంటారు. అయినా ఇలా రీమిక్స్ అయ్యి ప్రేక్షకులను ఒక రేంజ్‌లో మెప్పించిన పాటలు చాలా తక్కువే ఉన్నాయి. అనవసరంగా ఒక కల్ట్ క్లాసిక్‌ను టచ్ చేశారు, ఆ పాటను టచ్ చేయకుండా ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రేక్షకులే ఎక్కువమంది ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు తన కల్ట్ క్లాసిక్ పాటను మరోసారి రీక్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు రవితేజ.


మర్చిపోలేని సినిమా

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రవితేజ. అందుకే తన ఫ్యాన్స్ అంతా తనను ప్రేమగా మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. తన కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా రవితేజ వెనకాడలేదు. ఇక హీరోగా అవకాశాలు రావడం మొదలయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోయాడు. అలా రవితేజ కెరీర్‌ను హీరోగా నిలబెట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ‘ఇడియట్’ కూడా ఒకటి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ యాటిట్యూడ్ అప్పట్లో మాత్రమే కాదు.. ఇప్పటి యూత్‌కు కూడా చాలా ఇష్టం. ఇక ఈ సినిమాలో పాటలను కూడా ప్రేక్షకులు ఇప్పటికీ ఇష్టంగా వింటుంటారు.


కల్ట్ క్లాసిక్

పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ‘ఇడియట్’ మూవీకి చక్రి సంగీతాన్ని అందించారు. అందులోని ప్రతీ పాట ఒక క్లాసిక్‌గా మిగిలిపోయింది. అందులోనూ ముఖ్యంగా ‘చూపులతో గుచ్చి గుచ్చి’ పాటకు యూత్‌లో ఉన్న క్రేజే వేరు. హీరోయిన్ వెంటపడుతూ, తనను ఆటపట్టిస్తూ హీరో పాడే పాట ఇది. అందుకే ఈ పాటకు యూత్ అంతా ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇందులో రవితేజ స్టెప్స్‌ను రీక్రియేట్ చేయడం కోసం ఇప్పటికీ కష్టపడుతుంటారు. అలాంటి ఈ కల్ట్ క్లాసిక్ సాంగ్‌ను రీమిక్స్ చేయడానికి రవితేజ సిద్ధమయ్యాడని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తన అప్‌కమింగ్ మూవీ ‘మాస్ జాతర’ కోసం రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: మ్యూజిక్ కోసం ముంబాయ్‌లో సిట్టింగ్.. ఏకంగా ఆ దిగ్గజ ద్వయంతో.!

అవే స్టెప్పులు

భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న చిత్రమే ‘మాస్ జాతర’ (Mass Jathara). ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక మేలో విడుదలను ఖరారు చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఇదే క్రమంలో ‘చూపులతో గుచ్చి గుచ్చి’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయాలని నిర్ణయించుకున్నాడట రవితేజ. ఈ మాస్ మహారాజ్ మళ్లీ అదే పాటకు, అవే స్టెప్పులు వేస్తే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ అప్పుడే ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వెండితెరపై చూపులతో గుచ్చి గుచ్చి పాటకు రవితేజ డ్యాన్స్ చేయడం చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×