BigTV English

Shubman Gill: హెడ్ క్యాచ్… గిల్ కు అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్?

Shubman Gill: హెడ్ క్యాచ్… గిల్ కు అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్?

Shubman Gill: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు కీలక సెమీఫైనల్ మ్యాచ్ లో దుబాయ్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బౌలింగ్ ప్రారంభించింది. అయితే ఆస్ట్రేలియాకి మహమ్మద్ షమీ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మూడవ ఓవర్ లో కూపర్ కొన్నోలిని పెవిలియన్ చేర్చాడు.


 

9 బాల్స్ ఆడిన కూపర్ కొన్నోలి పరుగులు చేయకుండానే వికెట్ కీపర్ కే.ఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వాస్తవానికి మొదట అంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో టీమిండియా రివ్యూ తీసుకోవడంతో రిప్లై లో బంతి బ్యాట్ ని తాగినట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నాలుగు పరుగుల వద్ద మొదటి వికెట్ ని కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ ట్రావీస్ హెడ్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.


ఫోర్లు, సిక్సర్లతో భారత జట్టును కంగారు పెట్టించాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దించాడు. దీంతో తొమ్మిదో ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి.. ఈ ఓవర్ లోని మొదటి బంతిని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా బ్యాటర్ ఒక పరుగు తీయగా.. వీరిద్దరి మధ్య పార్టనర్షిప్ 50 కి చేరింది. దీంతో క్రీజ్ లోకి వచ్చిన హెడ్.. రెండవ బంతిని హెడ్ భారీ షాట్ ఆడాడు. కానీ టైమింగ్ మిస్ కావడంతో బంతి గాల్లోకి లేచింది.

ఈ క్రమంలో లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి చక్కటి క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ పట్టిన వెంటనే బంతిని పక్కకి పడేశాడు. ఈ క్రమంలో కొత్త రూల్ ప్రకారం ఇది క్యాచ్ కాదు. కానీ గిల్ కి వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. హెడ్ నీ అవుట్ గా ప్రకటించాడు. దీంతో 33 బంతులలో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన హెడ్ 39 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

అనంతరం 110 పరుగుల వద్ద లబుషేన్ ని.. రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. 29 పరుగులు చేసిన లబుషేన్ ని రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తరువాత జోష్ ఇంగ్లీస్ ని కూడా అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తన నాలుగో వికెట్ ని కూడా కోల్పోయింది. ప్రస్తుతం 33 ఓవర్ల వద్ద 177 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ {స్టీవ్ స్మిత్ 68*}, అలెక్స్ క్యారీ {24*} పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

 

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ” మేం ఈ కీలక మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. మొదట బ్యాటింగ్ చేసేందుకైనా, లేక చేజింగ్ చేసేందుకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్కసారి టాస్ గెలిస్తే ఏది ఎంచుకోవాలో తెలియక గందరగోళానికి గురవుతాం. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. టాస్ ఓడిపోవడమే మంచిదయింది. ఇక గత మ్యాచ్లో ఆడినట్టునే మళ్లీ బరిలోకి దింపుతున్నాం” అని తెలిపాడు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×