Venu Yellamma Movie:జబర్దస్త్ (Jabardast).. ఈ కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక కామెడీ ఎంటర్టైన్మెంట్ షో అని చెప్పవచ్చు. ఈ షో ద్వారా ఎంతో మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు కూడా. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి వచ్చి దర్శకులుగా, నిర్మాతలుగా, హీరోలుగా, కమెడియన్లుగా కూడా సెటిల్ అయ్యి.. పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అలాంటి వారిలో వేణు యెల్దండి (Venu Yeldandi) కూడా ఒకరు. కమెడియన్ గా జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన.. ఆ తర్వాత పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఎల్లమ్మ మ్యూజిక్ మూవీ కోసం దిగ్గజ ద్వయం..
బలగం సినిమాతో డైరెక్టర్ గా మారిన వేణు ఈ సినిమా అందించిన క్రేజ్ తో ఇప్పుడు ఎల్లమ్మ (Yellamma) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ హీరో నితిన్ (Nithin) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలో కలిసి దర్శకుడు వేణు ముంబైలో ఎల్లమ్మ సినిమా సంగీత సిట్టింగ్స్ కోసం ఉన్నట్లు సమాచారం. నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం ద్వయం అజయ్-అతుల్ (Ajay – Athul) సంగీతం అందిస్తున్నారు, ఈ సినిమా మే నెలలో ప్రారంభం అవ్వనున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ‘బలగం’ సినిమాతో డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకున్న వేణు.. ఈ సినిమాతో అంతకుమించి స్టేటస్ ను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.
బలగం మూవీతో డైరెక్టర్ గా స్టార్ స్టేటస్..!
ఇక ‘బలగం’ అనే సినిమాతో దర్శకుడిగా మారిన వేణు.. ఈ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు దర్శకుడిగా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.ప్రియదర్శి (Priyadarshi ), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) కాంబినేషన్లో.. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు పలు అవార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ లో సినిమాటోగ్రఫీ అవార్డులు, ఒనికో ఫిలిం అవార్డులు వంటి అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఇక కుటుంబ నాటక చిత్రంగా వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇక ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తో పాటు సుధాకర్ రెడ్డి, కోట జయరాం, మురళీధర్ గౌడ్, మధు తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2023 మార్చి 3న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో మరెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.