Ravibabu: ప్రముఖ నటుడు, డైరెక్టర్, కమెడియన్ రవిబాబు (Ravibabu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా హార్రర్ చిత్రాలకు పెట్టింది పేరుగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేస్తూ మెప్పిస్తున్న రవిబాబు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో ఉదయ్ కిరణ్ వల్లే తన ఈగో హర్ట్ అయింది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సోగ్గాడు ఫ్లాప్ పై స్పందించిన రవి బాబు..
ఇంటర్వ్యూలో భాగంగా.. హీరో తరుణ్(Tarun), ఆర్తి అగర్వాల్ (Arti agarwal) తో తీసిన ‘సోగ్గాడు’ సినిమాను హిందీలో ‘అజత్ ప్రేమ్ కి గజబ్ కహాని’ సినిమా తీశారు అని ఇంటర్వ్యూయర్ అడుగుతుండగానే.. రవిబాబు మాట్లాడుతూ.. నాతో కూడా ఎవరో చెప్పారు. ఆ సినిమా తీసి విడుదలయ్యి వందరోజుల తర్వాత నాకు ఈ విషయం చెప్పారు. సినిమాను చూస్తే సడన్గా ఇది మన సినిమానే అనిపిస్తుంది. కానీ వాళ్లు సినిమాలో కొన్ని చేంజెస్ చేశారు. క్లైమాక్స్ ని వాళ్ళు బాగా కమర్షియల్ క్లైమాక్స్ గా తీర్చిదిద్దారు. కమెడియన్స్, విల్లన్స్ తో క్లైమాక్స్ ని తీర్చిదిద్దేశారు అంటూ రవిబాబు తెలిపారు. ‘సోగ్గాడు’ సినిమా గురించి ప్రశ్నిస్తూ.. “మీ సినిమా ఎక్కడ ఫెయిల్ అయింది.. ఎక్కడ హిట్ అయింది.. దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు.. అసలు ఎక్కడ ఈ సోగ్గాడు.. సినిమా ఫ్లాప్ అయ్యింది” అని ప్రశ్నించగా.. “సోగ్గాడు సినిమాను కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే పెట్టి చేసాము. మొదటిరోజు రూ.1.50లక్షలు వచ్చాయి. రెండవ రోజు రూ.77 లక్షలు వచ్చాయి. ఇక రెండు, మూడు వారాలలో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా లభించాయి. కానీ ఇది కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. అటు మాటీవీలో కూడా ఎన్నోసార్లు ఈ సినిమాను ఆడియన్స్ చూశారు. కానీ ఎందుకు దీన్ని ఫ్లాప్ అంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ సోగ్గాడు ఫ్లాప్ పై రవిబాబు కామెంట్ చేశారు.
ఉదయ్ కిరణ్ వల్లే నా ఈగో హర్ట్ అయింది- రవిబాబు
“ఈ సినిమా కథను అనుకున్న సమయంలో నా ఇగో బాగా హర్ట్ అయింది. ఈ సినిమా అనుకున్నప్పుడు తరుణ్ ,ఆర్తి, ఉదయ్ కిరణ్ ముగ్గురు కూడా లీడ్ స్టేజ్లో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురితో సినిమా చేయాలని అనుకున్నాను. మొదట తరుణ్, ఆర్తి అగర్వాల్ ఫైనల్ అయిపోయారు. ఇక ఇంకొక పాత్రకు ఉదయ్ కిరణ్ సెట్ అవుతాడని అనుకున్నాను.. అందులో భాగంగానే చాలా రోజులు వెయిట్ చేసాను. ఇక చేస్తాను.. చెయ్యను అని చెప్పి విసిగించి, లాస్ట్ లో ఒకరోజు చేస్తానని కన్ఫామ్ గా చెప్పేశారు. ఇక నేను వెంటనే సురేష్ బాబుని వెళ్లి కలువు అని చెప్పాను. ఆయన ఏమో మాల వేసుకుని కూర్చున్నాడు. నాతో ఈరోజు చేస్తానని చెప్పి మరుసటి రోజు నేను చేయను అని చెప్పేసరికి నాకు కోపం వచ్చేసింది. అటు సురేష్ బాబు నేను ఇద్దరం కూడా ఆశ్చర్యపోయాము. వెంటనే నా ఈగో హర్ట్ అయిపోయింది. ఇప్పటివరకు అలాంటి సందర్భాన్ని నేను మళ్ళీ ఫేస్ చేయలేదు. నువ్వు కాకుంటేనేమీ.. ఇంకొకరిని హీరోగా తెచ్చి పెడతాను అంటూ అప్పుడు హిందీ నుంచి జూగల్ హంస రాజును తీసుకొచ్చి పెట్టాను. నిజానికి ఇద్దరూ స్టార్ హీరోలు చేయాల్సిన ఆ సినిమాలో ఒక హిందీ నటుడిని తీసుకొచ్చేసరికి కాస్త రోల్స్ బ్యాలెన్స్ తప్పాయి..అలా ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త కనెక్ట్ కాలేక పోయిందేమో కానీ నా లైఫ్ లో తీసుకున్న మొదటి ఎమోషనల్ ఈగో డెసిషన్ అది” అంటూ ఉదయ్ కిరణ్ చేసిన పనికి ఫైర్ అవుతూ కామెంట్లు చేశారు రవిబాబు