Lord Hanuman: హనుమంతుడి జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో హనుమంతుడి ఆలయాలకు తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. దాదాపు ప్రతి ఊరిలో హనుమంతుడి ఆలయంలో నిత్య పూజలు నిర్వహించడం కూడా మనం చూస్తుంటాం. కానీ చాలా మందికి హనుమంతుడి గురించిన అనేక రహస్యాలు తెలియవు. మరి బజరంగ్ బలి జయంతి రోజున హనుమంతుడి గురించి మీరు ఆశ్చర్యపోయే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమంతుడిని హనుమాన్ అని ఎందుకు పిలుస్తారు?
హనుమంతుడు చిన్న వయస్సులో ఒకసారి సూర్యుడిని పండు అని అనుకుని మింగడానికి పరిగెత్తాడట. ఆ సమయంలో ఇంద్రుడు గమనించి హనుమంతుడిపై కోపంతో పిడుగులు కురిపించాడని పురాణాలు చెబుతున్నారు. దీని కారణంగానే అతడి దవడ (సంస్కృతంలో హను ) వంకరగా మారిందని అంటారు. కాలక్రమంగా అప్పటి నుండి హనుమాన్ అని పిలవడం ప్రారంభం అయిందట.
హనుమంతుడు రామాయణం కూడా రచించాడా ?
వాల్మీకి రామాయణం రచించాడని అందరికీ తెలుసు కానీ.. హనుమంతుడు తన గోళ్ళతో హిమాలయంలోని శిలలపై అద్భుతమైన రామ కథను రాశాడట. అది వాల్మీకి చూసి ఆశ్యర్యపోయాడట. తాను కూడా అంత గొప్పగా రాయలేదని నిరుత్సాహపడ్డాడట. దీంతో గురువును గౌరవిస్తూ.. హనుమంతుడు దానిని పూర్తిగా చెరిపి వేసాడని చెబుతారు. అంత గొప్పగా రామ కథను హనుమంతుడు రాసాడని పురాణాల్లో పేర్కొన్నారు. హనుమంతుడు గురువు కోసం రామ కథను చెరిపివేయడం వల్ల మాత్రమే రామాయణం నేటికీ అంత గొప్ప ఇతిహాసంగా మిగిలిపోయింది.
హనుమంతుడికి ఎంత మంది సోదరులు ?
చాలా మంది హనుమంతుడు ఒంటరి వాడని అతడికి తోబుట్టువులు లేరని అనుకుంటారు. కానీ బ్రహ్మాండ పురాణం ప్రకారం హనుమంతుడికి ఐదుగురు సోదరులు ఉన్నారు. వారి పేర్లు మతి మాన్, శ్రుతి మాన్, కేతు మాన్, గతి మాన్, ధ్రుతి మాన్, వీరందరూ హనుమంతుడిలా బ్రహ్మచర్మం పాటించకుండా.. వివాహం చేసుకున్నారు.
బ్రహ్మచారి అయినా కూడా హనుమంతుడికి కొడుకు ఎలా పుట్టాడు:
హనుమంతుడు లంకను దహనం చేసిన తర్వాత సముద్రంలో తన మండుతున్న తోకను ఆర్పుతున్నప్పుడు అతడి చెమట కారణంగా సముద్రంలోని చేప గర్భం దాల్చింది. తద్వారా మకర ధ్వజుడు జన్మించాడు. మకర ధ్వజుడిని హనుమంతుడి కొడుకుడా చెబుతారు.
Also Read: హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి ? ఏం చేయకూడదు?
బజరంగ్ బలి.. అని హనుమంతుడిని ఎందుకు పిలుస్తారు ?
ఒక సారి సీతా దేవి తన జుట్టుకు సింధూరం పూసుకోవడం చూసిన హనుమంతుడు దానికి కారణం ఏంటని అడిగాడట. అప్పుడు సీతాదేవి శ్రీరాముడి దీర్ఘాయుష్షు కోసం తాను సింధూరం పూసుకున్నట్లు చెప్పింది. దీంతో రాముడి కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరం పూసుకున్నాడట. అందుకే అప్పటి నుండిహనుమంతుడిని బజరంగ్ ( వర్మిలియన్ కలర్ ) బాలి ( శక్తివంతమైన ) అని పిలుస్తారు.
రాముడు మరణించినప్పుడు హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు ?
రాముడు భూమిని వదిలి వైకుంఠానికి వెళ్లిపోతున్నప్పుడు హనుమంతుడు ఆపాడని చెబుతారు. కానీ రాముడు మరణించేటప్పుడుమాత్రం హనుమంతుడు దగ్గరలేడు. కాబట్టి వచ్చే సరికే రాముడు మరణించాడని అంటారు.