AC in Summer: వేసవి వచ్చిందంటే చాలు వేడిని తట్టుకోలేక చాలా మంది ఏసీలు, కూలర్లు వాడతారు. దీని వల్ల ఎండ వేడిమి నుంచి కొంతవరకైనా తట్టుకోవచ్చు. సమ్మర్‌లో వీటిని వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే అరోగ్యానికిి హాని కలిగే ప్రమాదం ఉందట. కొంచం సేపు ఎండలో ఉంటే చాలు ఇంటికి వెళ్లగానే ఏసీ టెంపరేచర్‌ను 16°C కూడా తగ్గించి పెట్టేస్తారు. ఇలా ఏసీని చాలా తక్కువ టెంపరేచర్‌లో ఉంచి వాడితే మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీన్ని ఏసీని ఎంత టెంపరేచర్‌లో వాడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఏసీని 18°C, 20°C వంటి అతి తక్కువ ఉష్ణోగ్రతలకు సెట్ చేస్తారు. దీని వల్ల కొంచం రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. కానీ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఏసీలో చాలా సమయం పాటు గడపడం వల్ల ఆరోగ్యానికి కొంతమందికి తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉందట. మరికొందరిలో గొంతు నొప్పి, గొంతు పొడిబారి పోవడం, చర్మం పొడిబారడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఎక్కువ సమయం పాటు ఏసీలో గడిపితే కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.
వేసవి కాలంలో ఏసీ టెంపరేచర్ 24°C నుంచి 26°C మధ్యలోనే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చలి పెట్టకుండా శరీరం చల్లబడుతుంది. దీని వల్ల ఎలాంటి హాని కలగదని అంటున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా ప్రమాదం జరగదని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ALSO READ: షుగర్ రావడానికి కారణం అదే..
రాత్రి సమయంలో కూడా ఏసీని ఏ టెంపరేచర్‌కు సెట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పడుకునే సమయంలో ఏసీని తక్కువ టెంపరేచర్‌కు సెట్ చేస్తే సరిగా నిద్రపట్టకపోవచ్చని అంటున్నారు. అందుకే నిద్రపోయే సమయంలో మాత్రం ఏసీని 25°C నుంచి 26°Cకు సెట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీన్నే స్లీప్ మోడ్ అని కూడా పిలుస్తారట.
ఏసీలోకి డస్ట్ లేదా క్రిమ్ములు చేరకుండా ఉండాలంటే తరచుగా శుభ్రం చేయడం మంచిది. ఏసీ నుంచి వచ్చే చల్లదనం గది అంతటా వ్యాపించాలంటే ఒక సీలింగ్ ఫ్యాన్‌ను కూడా వాడడం ఉత్తమం. ఏసీ కారణంగా చర్మం, గొంతు పొడిబారకుండా ఉండాలంటే తరచుగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరం కూడా హైడ్రేటెడ్‌గా మారుతుందట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.