Padma Awards 2025 : గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక పద్మ భూషణ్ కు ఎంపికైన హీరో బాలకృష్ణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు
పద్మ భూషణ్ కు ఎంపికైన హీరో బాలకృష్ణకు రవితేజ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సినిమాలకు, సమాజానికి ఎన్నో దాతృత్వ సేవలు అందించే ప్రయత్నం చేసినందుకు ఆయనకు తగిన గౌరవం లభించిందని తెలిపారు.
Congratulations to Padma Bhushan, Balayya Babu 🤗🤗🤗
A well-deserved honour for his contributions to cinema and philanthropic efforts toward society ❤️
— Ravi Teja (@RaviTeja_offl) January 25, 2025
కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ 139మందిని ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ ప్రకటించింది. అయితే ఏపీ నుంచి కళల విభాగంలో పలువురు ఎంపికయ్యారు. ఇందులో సినీనటుడు బాలకృష్ణ, వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.