Lady Aghori: గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ తరుచుగా ఎక్కడో ఓ చోట వార్తల్లో నిలుస్తుంది. నగ్నంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పోలీసులను సైతం ఆమె పలుమార్లు నోటికి వచ్చినట్లు తిట్టింది. ఇక సోషల్ మీడియాలో లేడి అఘోరి ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా అఘోరీ కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు.
కరీంనగర్ బైపాస్ రోడ్డులో అఘోరీ వాహనాన్ని కొందరు పోకరీలు ఓవర్ టేక్ చేశారు. దీంతో అఘోరీ, పోకిరీలతో వాగ్వాదానికి దిగింది. రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని ఆపి కాసేపు హల్చల్ చేసింది. ప్రయాణికులతో గొడవకు దిగింది. అయితే గొడవ సద్దుమణిగిన కాసేపు తర్వాత.. అఘోరీ వాహనంపైకి కొందరు పోకరీలు రాళ్లు విసిరారు. అనంతరం వెంటనే పోకరీలు అక్కడనుంచి పరారయ్యారు. దీంతో మళ్లీ అఘోరీ కాసేపు రోడ్డుపై హంగామా సృష్టించింది. అక్కడ నుంచి పోలీసులు అఘోరీ పంపించారు.
Also Read: Mandakrishna Madiga: మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం.. ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి..?
అయితే.. లేడీ అఘోరీ ప్రవర్తన పట్ల వాహనాదారులకు, ఆమె తిరుగుతోన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందికి గురవుతున్నారు. ఆమె నగ్నంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.