Naga Chaitanya..తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ(Akkineni Family) అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసులుగా ఇండస్ట్రీలోకి నాగార్జున (Nagarjuna)ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోగా ఎదిగాడు. అంతేకాకుండా మూడవ తరం వారసులుగా అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగచైతన్య స్టార్ హీరోగా ఎదిగారు. కానీ అఖిల్ మాత్రం ఇంకా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం కోసం కష్టపడుతున్నారు. ఇక వీరి సినిమాల విషయం పక్కనపెడితే.. పర్సనల్ లైఫ్ లో ఇద్దరు వివాహం చేసుకొని ఒక ఇంటి వాళ్ళయ్యారు. ఇందులో నాగచైతన్య(Naga Chaitanya) ముందుగా సమంతని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు.తర్వాత కొన్నాళ్లకు శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) ని రెండో పెళ్లి చేసుకున్నాడు.
ప్రియమైన మరదలికి అంటూ చైతూ పోస్ట్..
ఇప్పుడు తాజాగా నాగార్జున రెండో కొడుకు అఖిల్(Akhil) కూడా వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ భార్య పై నాగచైతన్య సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అదేంటంటే.. తాజాగా అఖిల్ శుక్రవారం ఉదయం తన ప్రియురాలు జైనాబ్ రవ్ డ్జి(Zainab Ravadjee)ని వివాహం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వీరి పెళ్లికి పలువురు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు.
ఇదే తరుణంలో తన తమ్ముడిని నాగచైతన్య ఆశీర్వదిస్తూ ఒక పోస్ట్ చేశారు.దీనికి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ ఫోటో ఒకటి తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసి..”నూతన వధూవరులకు అభినందనలు.. ప్రియమైన జైనాబ్ కి కుటుంబంలోకి స్వాగతం” అంటూ ఆయన రాసుకొచ్చారు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇలా పోస్ట్ పెట్టడం చూసి చైతూ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ: Aha Sarkaar 5:గుడ్ న్యూస్.. సుధీర్ ‘సర్కార్’లో మీరు ఇంటి నుంచే పాల్గొనవచ్చు, ఇదిగో ఇలా!
ఓకే ఫ్రేమ్ లో అక్కినేని ఫ్యామిలీ..
ఈ ఫోటోలో అక్కినేని నాగార్జున – అమల, నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల, కొత్తజంట అక్కినేని అఖిల్ – జైనాబ్ ముగ్గురు అక్కినేని దంపతులు కలిసి ఉన్న ఫోటో అక్కినేని అభిమానులను సంతోష పెడుతోంది. అంతేకాదు వీరంతా సాంప్రదాయ దుస్తులు ధరించి ముగ్గురు హీరోలు ముగ్గురు భార్యలతో కలిసి ఫోటో దిగడం వైరల్ గా మారింది. దీనిపై అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..
ఇక అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకున్న జైనాబ్ రవ్ డ్జీ విషయానికి వస్తే..ఆమె బడా బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ బిజినెస్ రంగాన్ని ఎంచుకోకుండా వెరైటీగా పెయింటర్ గా.. నటిగా రాణిస్తోంది. ఇక అఖిల్ – జైనాబ్ రవ్ డ్జీల పెళ్లి నాగార్జున ఇంట్లో సింపుల్ గా జరిగినప్పటికీ రేపు అనగా జూన్ 8 ఆదివారం రోజు అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ పార్టీని చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారట.