BigTV English

RC 16: శివన్న హైదరాబాద్ లో దిగడానికి కారణం ఇదే… పూనకలు లోడింగ్

RC 16: శివన్న హైదరాబాద్ లో దిగడానికి కారణం ఇదే… పూనకలు లోడింగ్

RC 16: రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా, ఆయన అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వడానికి RC 16 టీమ్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ జానర్‌లోకి అడుగు పెడుతున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.


స్పోర్ట్స్ డ్రామాగా RC 16

ఈ సినిమాలో రామ్ చరణ్ వివిధ క్రీడల్లో పాల్గొనే స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్యారెక్టర్ డిజైన్ అన్నీ యూనిక్ గా ఉంటాయని టాక్. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహిస్తూ, బర్త్ డే స్పెషల్ కోసం గ్రాండ్ ప్రిపరేషన్ చేస్తున్నారు.


శివన్న & దివ్యేందు హైదరాబాద్లో ల్యాండ్

ఈ మూవీకి సంబంధించి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న), బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు (మిర్జాపూర్ ఫేమ్) కీలక పాత్రలు పోషిస్తున్నారు. బర్త్ డే స్పెషల్ షూట్ కోసమే ఈ స్టార్ యాక్టర్స్ హైదరాబాద్ కి వచ్చారు. మల్టీస్టారర్ ఫార్మాట్ లో తెరకెక్కే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

బర్త్ డే రోజు – టైటిల్? గ్లిమ్ప్స్?

రామ్ చరణ్ అభిమానులు ఎప్పటి నుండో RC 16 టైటిల్, ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం:

  • ఫస్ట్ లుక్ పోస్టర్ – బర్త్ డే స్పెషల్ గా రానుంది.
  • టైటిల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది.
  • కొంతమంది మాత్రం చిన్న గ్లిమ్ప్స్ రీలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అసలే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా RRR తర్వాత భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. కాబట్టి, టైటిల్ గానీ, గ్లిమ్ప్స్ గానీ రిలీజ్ చేస్తే అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ.

వృద్ధి సినిమాస్ భారీ ప్రాజెక్ట్

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ & బుచ్చిబాబు సానా కాంబినేషన్ ఇప్పటికే అంచనాలు పెంచగా, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముంబై నుండి రామ్ చరణ్ రీసెంట్ గా రాగానే ఫోటోషూట్ లో బిజీ అయ్యారు. మార్చి 27న రాబోయే RC 16 స్పెషల్ అనౌన్స్మెంట్ అభిమానులకు పండుగే!

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×