Actor Ravi Varma: తెలుగు నటుడు రవివర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఈయన సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకప్పుడు హీరోలకు ఫ్రెండ్ గా నటిస్తున్న ఈయన ఈమధ్య విలన్ గా మారి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికాలో పెద్ద చదువులు చదువుకున్న ఈయన ఇప్పుడు సినిమాల్లో నటుడుగా రానిస్తున్నాడు. అయితే ఈ జీవితంలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్టార్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ తన కాళ్లు పట్టుకోవడం వంటి విషయాల గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కీలక విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎటువంటి విషయాల గురించి చర్చించారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
రవి వర్మ ఇంటర్వ్యూ..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన లైఫ్ లో జరిగిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈయన తూర్పుగోదావరి జిల్లాలో జన్మించాడు ఆ తర్వాత హైదరాబాదులో ఆయన విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగంలో చేరినట్లు చెప్పారు. ఆ తర్వాత ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నటన మీద ఆసక్తితో అటుగా అడుగులు వేసినట్లు ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసాడు. అలా వెన్నెల సినిమా అవకాశంతో 2005 లో వెండితెర పై కనిపించాడు. ఇక 2006 లో ఏకంగా మూడు పెద్ధ సినిమాల్లో ఆఫర్స్ అందుకుని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే విలన్ గా పలు పాత్రల్లో నటించి మెప్పించాడు.
Also Read :చిన్నప్పుడే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను.. లైవ్ లోనే ఏడ్చేసిన హీరోయిన్..
ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నాడు..
ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.. ఎన్టీఆర్ చదివిన సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రిన్సిపాల్ నా స్నేహితుడు మహేందర్ రెడ్డి అని చెప్పగానే షాక్ అయ్యాడు. నీ వయసేంత అంటూ ప్రశ్నలు వేసాడు.. ఆ తర్వాత నేను అసలు విషయం చెప్పడంతో బాగా క్లోజ్ అయ్యాడు అప్పటినుంచి నాకు మంచి ఫ్రెండ్ గా ఎన్టీఆర్ అనిపిస్తాడు. అయితే రాఖీ సినిమాలో తన చెల్లెలికి అన్యాయం చేయొద్దు అంటూ కాళ్లు పట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది ఆ సీన్లు ఎన్టీఆర్ నాకు కాళ్లు పట్టుకోవడం నేను ఇంకా మర్చిపోలేక పోతున్నాను. నేను వద్దని చెప్పినా కూడా అసిన్ బాగా పండుతుందని చెప్పడంతోనే ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నాడని బయట పెట్టాడు. ఆ మూవీ తర్వాత సినిమా రిలీజ్ టైం లో ఎన్టీఆర్ కూడా నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఎన్టీఆర్ నాతో నడుచుకున్న తీరు గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేను అంత మంచి వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ఇద్దరం కలిసి పని చేయకపోయినా సరే ఎన్టీఆర్ ఎక్కడైనా కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తాడంటూ రవివర్మ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ ఇంటర్వ్యూ వీడియోని ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. త్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయిన ఎన్టీఆర్ గతేడాది కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమాలో నటించాడు.. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్లు మాత్రం దుమ్ము దులిపేసింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.