BigTV English

RC15 New Song : న్యూజిలాండ్‌లో రామ్ చ‌ర‌ణ్‌.. పాట‌కు రూ.15 కోట్లు ఖ‌ర్చు!

RC15 New Song : న్యూజిలాండ్‌లో రామ్ చ‌ర‌ణ్‌.. పాట‌కు రూ.15 కోట్లు ఖ‌ర్చు!

RC15 New Song : మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. RC 15 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా లేటెస్ట్ న్యూజిలాండ్‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇప్ప‌టికే ఎంటైర్ యూనిట్ అక్క‌డ‌కు చేరుకుంది. మెగాప‌వ‌ర్‌స్టార్ జిమ్ చేస్తూ చిల్ అవుతున్నాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ షెడ్యూల్‌లో లావిష్ పాట‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. లావిష్ సాంగ్ అంటున్నారు.. ఎంత ఖ‌ర్చు పెట్ట‌బోతున్నార‌నే సందేహం రాక మాన‌దు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఏకంగా శంక‌ర్ ఈ పాట కోసం రూ. 15 కోట్లు పైగానే ఖర్చు పెట్ట‌బోతున్నార‌ట‌. ఇది ఓ సెకండ్ టైర్ హీరో మూవీ బ‌డ్జెట్‌కు స‌మానం. అంత ఖ‌ర్చు పెట్టి ఓ సాంగ్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారంటే మామూలు విష‌యం కాద‌ని టాక్ స్ప్రెడ్ అవుతుంది.


ఈ ఏడాది విడుద‌లైన RRRతో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఇప్పుడు RC 15తో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీలో చ‌ర‌ణ్‌.. ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఓ పాత్ర‌లో ముఖ్య‌మంత్రిగా, మ‌రో పాత్ర‌లో ఎన్నిక‌ల అధికారిగా ఆయ‌న మెప్పించ‌బోతున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్.. దిల్ రాజు, శిరీష్ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కానుంది.


Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×