BigTV English

Samantha : హీరో దర్శ‌క‌త్వంలో సినిమాకు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్‌..!

Samantha : హీరో దర్శ‌క‌త్వంలో సినిమాకు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్‌..!

Samantha : స్టార్ హీరోయిన్ స‌మంత రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా మూవీ ‘యశోద’తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా త‌ర్వాత స‌మంత ఏ సినిమా చేయ‌నుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే సినిమా చేస్తాన‌ని స‌మంత చెప్పేసింది. మ‌రో వైపు ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలోనూ న‌టించ‌టానికి స‌మంత అంగీక‌రించింది. ఈ సినిమాల్లో ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళుతుందోన‌ని అంద‌రూ వెయిట్ చేస్తున్నారు.


అయితే సినీ స‌ర్కిల్స్‌లో మాత్రం స‌మంత స‌మంత నెక్ట్స్ మూవీకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే. హీరో నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో స‌మంత మూవీ చేయ‌నుంది. నిజానికి రాహుల్ ర‌వీంద్ర‌న్‌, స‌మంత మంచి స్నేహితులు.. అదే ప‌రిచ‌యంతో రీసెంట్‌గా రాహుల్‌.. స‌మంత‌కు ఈ క‌థ‌ను వినిపిస్తే ఆమె న‌టించ‌టానికి ఓకే చెప్పేసింద‌ని టాక్‌. రాహుల్ ముందు ఇదే క‌థ‌ను ర‌ష్మిక మంద‌న్న‌తో చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఆమె క‌థ కూడా వింది. అయితే ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ మెటీరియ‌లైజ్ కాలేదు. ఇప్పుడ‌దే క‌థ‌లో మార్పులు చేర్పులు చేసి స‌మంత‌కు వినిపిస్తే స‌మంత ఓకే చెప్పింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సమంత నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతుంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×