Buchi Babu – Rajamouli: ప్రతి హీరోకి ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంటుంది. కొందరు హీరోలు కొన్ని సినిమాల్లో మాత్రమే చాలా అందంగా కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తొలిప్రేమ, తమ్ముడు,బద్రి,ఖుషి వంటి సినిమాలలో చాలా అందంగా కనిపిస్తాడు. అలానే గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలలో హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో కూడా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. అయితే అదే హీరోయిన్స్ ఇంకొన్ని సినిమాలు చేసినప్పుడు అంత అందంగా కనిపించకపోవచ్చు. దీనికి కారణం దర్శకుడు ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన విధానం, అలానే ఆ క్యారెక్టర్ ను వెండితెరపై ఆవిష్కరించిన విధానం ఇవన్నీ కూడా ప్రతి సినిమాకి ప్లస్ పాయింట్ గా మారుతాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే తను ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాలో పూరి జగన్నాథ్ చాలా అందంగా చూపిస్తాడు. ఆ సినిమాలో లాంగ్ హెయిర్ తో కనిపిస్తాడు చరణ్. అప్పట్లో చాలామంది ఇదే ఫ్యాషన్ అనుకుని కూడా పెంచారు.
వాస్తవానికి రామ్ చరణ్ ను రాజమౌళి లాంచ్ చేయాలి. కానీ చిరంజీవి కొడుకు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అందుకని కావాలనే రాజమౌళి మొదట అవకాశాన్ని వదిలేసి తనతో సెకండ్ సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. అప్పుడు చేసిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. చరణ్ కి బేసిక్ గా లాంగ్ హెయిర్ చాలా బాగుంటుంది. మగధీర టైం లో కూడా ఆ అబ్బాయిది హెయిర్ చాలా బాగుంటుంది. వీలైనంత పెంచితే మనం స్టైలింగ్ చేద్దామని రమా రాజమౌళి.. రాజమౌళితో చెప్పారు. వాళ్లు మగధీర సినిమాకి అదే పని చేశారు చరణ్ గుర్రం మీద వస్తుంటే హెయిర్ ఎగురుతూ ఉంటుంది. అది చూస్తుంటేనే ఒక హై వస్తుంది.ఆ తర్వాత చరణ్ చేసిన త్రిబుల్ ఆర్ లో మళ్లీ అల్లూరి సీతారామరాజు పాత్రకి లాంగ్ హెయిర్ పెట్టాడు జక్కన్న. ఆ తర్వాత లాంగ్ హెయిర్ తో చరణ్ ను చూపించే ప్లాన్ లో ఉన్నాడు బుచ్చిబాబు. నిన్న బుచ్చిబాబు అప్లోడ్ చేసిన ఫోటోలో కూడా లాంగ్ హెయిర్ ఉంది.
Also Read: Akkineni Akhil : అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా ?
వాస్తవానికి ఈ స్టేట్మెంట్ రమా రాజమౌళి మగధీర టైంలో ఇచ్చినా కూడా చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే సుకుమార్ మాత్రం మొదటిసారి చరణ్ కి ఒక కొత్త లుక్ ట్రై చేసి రంగస్థలం సినిమాతో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు బుచ్చిబాబు కొత్త లుక్ తో ఇంతకుముందు ఎప్పుడు చరణ్ ని చూడని విధంగా చూపించి ఆడియన్స్ సప్రైజ్ చేయనున్నాడు. ఇకపోతే ఈ సినిమాను కూడా కేవలం 6 నెలల నుంచి ఎనిమిది నెలల వ్యవధిలోనే పూర్తిచేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.