BigTV English
Advertisement

Badshah : బాలీవుడ్ రాపర్ బాద్షా క్లబ్లో పేలుడు… బాంబ్ విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు

Badshah : బాలీవుడ్ రాపర్ బాద్షా క్లబ్లో పేలుడు… బాంబ్ విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు

Badshah : బాలీవుడ్ లో ఇటీవల కాలంలో వరుసగా షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. అలాగే సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర గన్ ఫైర్ జరగడం ఆందోళనను కలిగించింది. తాజాగా హిందీ ర్యాపర్ బాద్షా క్లబ్ లో షాకింగ్ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా బాంబ్ వేసి వెళ్ళిన ఘటన కలకలం రేపుతోంది.


గత అర్థరాత్రి చండీగఢ్‌లోని సెక్టార్ 26లో రాపర్ బాద్షాకు చెందిన నైట్ క్లబ్ బయట పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. దానివల్ల స్వల్ప నష్టం వాటిల్లిందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు, ఇద్దరు గుర్తు తెలియని నిందితులు మోటార్‌ బైక్‌పై వచ్చి రెండు క్లబ్‌ ల బయట నాటు బాంబ్ లు విసిరినట్టు పోలీసులు గుర్తించారు. అందులో ఒక క్లబ్ పేరు సెవిల్లే క్లబ్, మరొకటి దాని పక్కనే ఉన్న డియోరా క్లబ్ అండ్ రెస్టారెంట్. ఈ రెండింట్లో ఒక క్లబ్ బాద్షాకు చెందినది.

ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పేలుడు కారణంగా రెండు క్లబ్‌లు అండ్ రెస్టారెంట్‌లోని కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయని, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఘటన జరగ్గానే సమాచారం అందుకున్న చండీగఢ్ పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుని నమూనాలు సేకరించింది. ప్రస్తుతం నిందితుల గురించిన సమాచారం కోసం పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న ప్రజలను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.


శత్రుత్వం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, నిందితులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చండీగఢ్ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే డియోర్రా అలెహౌస్ అండ్ కిచెన్ రెస్టారెంట్‌లోని ఉద్యోగి మాట్లాడుతూ ఈ సంఘటన అర్థరాత్రి జరిగిందని, రెస్టారెంట్ అప్పటికే క్లోజ్ చేశారని వెల్లడించారు. పెద్ద పేలుడు శబ్దం వినడంతో అక్కడే ఉన్న తాము బయటికి పరుగెత్తాము, రోడ్డు వైపు ఉన్న తలుపు, కిటిక అద్దాలు పగిలిపోవడం చూశామని అతడు చెప్పుకొచ్చాడు. పేలుడు జరిగినప్పుడు రెస్టారెంట్‌లో ఏడెనిమిది మంది ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. అదృష్టవశాత్తూ అక్కడ ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరి నిందితులను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో చూడాలి.

రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితులతో పాటు, 5 కోట్లు ఇవ్వకపోతే ఆయనను చంపేస్తామని బెదిరించిన వారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. షారుఖ్ ఖాన్ విషయంలో కూడా ఇలా బెదిరింపులకు పాల్పడ్డ వారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు బాద్షా వంతు వచ్చింది. ఎలాంటి బెదిరింపులు లేకుండా ఏకంగా ఆయన రెస్టారెంట్ పై బాంబ్ దాడి జరగడం బాద్షా అభిమనులను టెన్షన్ పెడుతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×