BigTV English

Pradeep Ranganathan : హీరో ప్రదీప్ రంగనాథన్ రియల్ స్టోరీ.. డైరెక్టర్ నుంచి హీరోగా..

Pradeep Ranganathan : హీరో ప్రదీప్ రంగనాథన్ రియల్ స్టోరీ.. డైరెక్టర్ నుంచి హీరోగా..

Pradeep Ranganathan : కష్టే ఫలి అని పెద్దలు ఊరికే అనలేదు.. కష్టపడిన వారికి ఫలితం దక్కకుండా పోదు ఏదో ఒక రూపంలో ఎప్పుడు ఒకసారి దక్కుతుంది అని పెద్దలు అంటారు. సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది ఎన్నో కష్టాలను అధిగమించి ఇప్పుడు స్టార్ హోదాని అనుభవిస్తున్నారు అలాంటి వారిలో రీసెంట్ గా భారీ విజయాన్ని అందుకున్న ‘డ్రాగన్’ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) కూడా ఒకరు. ఈ హీరో గురించి చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఈయన డైరెక్ట్ గా హీరోనిగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా, డైరెక్టర్ గా, ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ప్రదీప్ బ్యాగ్రౌండ్ గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..


ప్రదీప్ రంగనాథ్ బ్యాగ్రౌండ్.. 

కోలీవుడ్ యువ సంచలనం ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడేతో హీరోగానే కాదు డైరెక్టర్ గా కూడా తన ప్రతిభ చాటుకున్న అతను రీసెంట్ గా డ్రాగన్ అదే తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కలెక్షన్స్ కూడా అదరగొట్టేస్తున్నాయని తెలుస్తుంది.. డ్రాగన్ మూవీతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు..


ప్రదీప్ రంగనాథన్ SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ లో చదివారు. వాట్సాప్ కాదల్ తో సహా పలు షార్ట్ ఫిల్మ్‌లు తీయడం ద్వారా ప్రదీప్ తన కెరీర్‌ని ప్రారంభించాడు. అతను నటన, ఎడిటింగ్ దర్శకత్వం చేయడం ద్వారా మల్టీ టాస్క్ చేసేవాడు. జయం రవి, వెల్స్ ఇంటర్నేషనల్ అతను మొదటిసారి డైరెక్టర్ గా మారాడు. కోమలి అని వెల్లడించిన ఈ చిత్రం టైటిల్‌లో కాజల్ అగర్వాల్ కూడా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా విజయం సాధించింది. ప్రదీప్ రంగనాథన్ కూడా చివరికి కోమలి క్లైమాక్స్ భాగంలో అతిధి పాత్రలో కనిపించాడు.1996 లో రాజకీయాల్లోకి వస్తానని హామీ ఇచ్చిన రజనీకాంత్ ఫ్లాష్‌బ్యాక్ చిత్రం ట్రైలర్‌లోని ఒక భాగంలో పేర్కొనడం వల్ల రజనీకాంత్ అభిమానులు సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేయడంతో కోమలి థియేటర్‌లో విడుదలకు ముందే అతను వివాదానికి గురయ్యాడు. దాంతో ఈ సినిమాలోని ఆ సీన్ ని తీసేసి రిలీజ్ చేశారు.

ఆ తర్వాత లవ్ టుడే సినిమాతో దర్శకుడు హీరోగా మారాడు.. తమిళనాడులో తక్కువ బడ్జెట్‌తో థియేటర్లలో విడుదలైంది. అయితే, విడుదలైన తర్వాత ఇది తక్షణ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. లవ్ టుడేతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. అతను ఈ చిత్రంతో తన పూర్తి స్థాయి నటనను ప్రారంభించాడు. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ ని నిరూపించుకుంటూ ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యాడు..

డ్రాగన్ మూవీ సక్సెస్.. 

తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కలెక్షన్స్ కూడా అదరగొట్టేస్తున్నాయని తెలుస్తుంది. ఐతే డ్రాగన్ హీరో టాలెంట్ గుర్తించిన మైత్రి మూవీ మేకర్స్ అతనితో సినిమా లాక్ చేసుకుంది. ఆ కారణంగానే డ్రాగన్ ని తెలుగులో రిలీజ్ చేశారు. ఆ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మంచి టాక్ తో దూసుకుపోతుంది. ప్రదీప్ రంగనాథ్ ప్రస్తుతం తమిళంలో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఎల్.ఐ.కె సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×