Rashmika Mandanna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు పాన్ ఇండియా సెలబ్రిటీగా మారిపోయిన ఈమెను అభిమానులు ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటున్నారు.. ప్రస్తుతం చేతినిండా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాతో ఆమె విజయ పరంపర మొదలైందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరుసగా పుష్ప 2, ఛావా లతో భారీ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇక ఇప్పుడు బడా హీరోల సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.
ఇద్దరి మధ్య అన్ని సంవత్సరాలు తేడానా..?
ఇకపోతే రష్మిక మందన్న సినీ జీవితం తెరిచిన పుస్తకం. కానీ వ్యక్తిగత జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక..
గతంలో తన చెల్లెలి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి కారణం రష్మికకు పదేళ్ల వయసున్న ఒక చెల్లెలు ఉంది. ఈ చిన్నారి పేరు షిమాన్ మందన్న(Shiman mandanna) . గత ఏడాది మే 2వ తేదీన తన చిన్నారి చెల్లి బర్తడే సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఫోటోలు షేర్ చేస్తూ.. తన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే తన చెల్లి బర్త్డే సెలబ్రేషన్స్ మిస్ అవుతున్నాను అంటూ కూడా రాసుకుంది. ఇక ఈ పోస్ట్ చూసి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈమెకు ఇంత చిన్న చెల్లెలు ఉందా ? అంటూ కామెంట్లు చేశారు. ఇకపోతే రష్మిక వయసు 28 సంవత్సరాలు. ఆ చిన్నారి వయసు 10 సంవత్సరాలు. ఇలా ఇద్దరి మధ్య 18 సంవత్సరాల గ్యాప్ ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన చెల్లెల్ని మిస్ అవుతున్నానని, తన చిన్నారి చెల్లెలు ఎదుగుదలను తాను మిస్ అవ్వడం తనకు బాధ కలిగిస్తోందని, తనతో సరదాగా గడిపే సమయాన్ని కూడా మిస్ అవుతున్నాను” అంటూ రష్మిక గతంలో తెలిపింది. అంతేకాదు తన చెల్లి పుట్టిన దగ్గర నుంచి చాలా రోజులు ఆమెతో గడిపానని తెలిపిన ఈమె, ఆ పాపకు స్నానం చేయించడం , డైపర్స్ మార్చడం అన్ని పనులు దగ్గరుండి చేసేదాన్ని అంటూ తెలిపింది. మొత్తానికి అయితే రష్మిక తన చెల్లెలితో గడిపే సమయాన్ని బాగా మిస్ అవుతున్నాను అని తెలిపి అందరిని ఆశ్చర్యపరిచింది.
రష్మిక సినిమాలు..
రష్మిక సినిమాల విషయానికి వస్తే.. గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, సికిందర్ వంటి చిత్రాలతో పాటు ‘కుబేర’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా కుబేరకు సంబంధించిన పోస్టర్ ను ఇటీవల విడుదల చేయగా.. ఇందులో రష్మిక పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకోబోతోందని డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar kammula) వెల్లడించారు. మొత్తానికి అయితే రష్మిక అటు వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్లే తన ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించలేకపోతున్నట్లు తెలిపింది.ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన సికిందర్ అనే సినిమాలో నటిస్తోంది.
Hero Darshan: అభిమాని హత్య కేసులో హీరోకి ఊరట.. హైకోర్టు కీలకతీర్పు.!