Reba monica:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో యంగ్ బ్యూటీ కూడా పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియదనే చెప్పాలి. సడన్గా తన భర్తతో క్లోజ్ గా ఉండే ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు రెబా మోనికా జాన్(Reba monika John) . ఇటీవల వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్వాతి రెడ్డి పాటతో అదరగొట్టేసిన ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు తన భర్తతో కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజెన్స్ ఏంటి.. రెబా మోనికాకు పెళ్లయిపోయిందా? అంటూ కామెంట్లు ఆశ్చర్యంతో కామెంట్లు చేస్తున్నారు.
శ్రీ విష్ణు సినిమాతో తెలుగు తెరక పరిచయమైన రెబా మోనిక..
శ్రీ విష్ణు (Sri Vishnu) హీరోగా నటించిన ‘సామజవరగమన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె బెంగళూరుకు చెందినవారు. 2016లో ‘జకబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తమిళ్ సినిమాలలో ఎక్కువగా నటించింది. ఎఫ్ఐఆర్, బూ, ఫోరెన్సిక్, జరుగండి, బిగిల్, మైఖేల్ తదితర హిట్ చిత్రాలలో నటించింది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు బిగిల్ వంటి సినిమాలలో స్పెషల్ పాత్రలతో కూడా ఆకట్టుకుంది. ఇక సామజ వరగమన సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయిన ఈమె ఇందులో అందం నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకున్న ఈమె రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమాతో కుర్రకారును ఆకట్టుకుంది.
ALSO READ:Sailesh Kolanu: షూటింగ్లో నాని తలకు గాయం.. విస్తుపోయే నిజం బయటపెట్టిన డైరెక్టర్..!
భర్తతో రొమాంటిక్ గా ఉండే ఫోటోలు పంచుకున్న బ్యూటీ..
ఇకపోతే ఈమె సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెడితే, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోతో అభిమానులను ఇంస్టాగ్రామ్ లో ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి షేర్ చేసిన ఫోటోలు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అందులో తన భర్త జోమన్ జోసెఫ్ తో కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలను పంచుకుంది. తన భర్త పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ఈ ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి మన రెబాకి పెళ్లయిపోయిందా..? అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే రెబా మోనిక జాన్, జోమన్ జోసెఫ్ ల వివాహం 2022లో జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఇక జోమన్ జోసెఫ్ విషయానికి వస్తే.. ఈయన ఒక ఎమ్మెన్సీ కంపెనీలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు పలు వ్యాపారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇన్ని రోజులు పెళ్లి కాలేదు అనుకున్న ఈమెకు సడన్గా పెళ్లయిందని తెలిసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు అని చెప్పవచ్చు.